ప్రధాని మోదీ ఈరోజు దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ప్రకటన చేసింది. కరోనా మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా పరిశ్రమలకు లేబర్స్ కొరత ఏర్పడుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కార్మికులకు ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. కేంద్రం వర్కింగ్ అవర్స్ ను పెంచే అవకాశం ఉందని సమాచారం. కేంద్రం పని గంటలను 8 నుంచి 12 గంటలకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
లాక్ డౌన్ పొడిగింపు వల్ల కేంద్రం తప్పనిసరి పరిస్థితుల్లో పని గంటలు పెంచేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువులకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. అందువల్ల కేంద్రం రాబోయే 5 నెలల పాటు పని గంటలు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కేంద్రం ఇందుకోసం చట్టాలు మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
కేంద్రం చట్టాల్లో మార్పులు చేస్తే పని గంటలు మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్రం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా దీన్ని అమలు చేయవచ్చని తెలుస్తోంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే కంపెనీలు షిఫ్ట్ టైమింగ్స్ కూడా పెంచుకోవచ్చు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని కంపెనీలు, ఇతర సంస్థలు పని గంటలు పెంచాలని కోరినట్లు సమాచారం. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించిన ప్రకటన వెలువడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: