క‌రోనా వైర‌స్ వ్యాప్తికి చైనా కార‌ణ‌మైంద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్న వేళ భార‌త్ తీసుకున్న నిర్ణ‌యంతో డ్రాగ‌న్ కంట్రీకి తొలిషాక్ త‌గిలింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో భారత్ తెచ్చిన మార్పులు చైనాకు మింగుడుప‌డ‌టం లేదు. ఎఫ్‌డీఐల‌కు ప‌రిమితులు విధించ‌డంతో బ్యాంకింగ్ రంగంలోకి ప్ర‌వేశించి దేశ ఆర్థిక రంగాన్ని చేతిలోకి తీసుకోవాల‌ని పన్నాగం వేసిన చైనా కుతంత్రాన్ని భార‌త్ ప‌సిగ‌ట్టేసింది. అందుకే అక‌స్మాత్తుగా విదేశీ పెట్టుబడుల విష‌యంలో ముంద‌స్తు అనుమ‌తుల‌ను త‌ప్ప‌నిస‌రి చేసింది. అయితే  చైనా మాత్రం నీతి వాక్యాలు వ‌ల్లిస్తోంది. 


ఇది వివక్ష పూరితమని, స్వేఛ్చా వాణిజ్యానికి వ్యతిరేకమని, ప్రపంచ వాణిజ్యం సంస్థ నియమనిబంధనలకు విరుద్ధమని గ‌గ్గోలు పెడుతోంది. ఈ విధానాన్ని పునఃసమీక్షించాలని డిమాండ్ కూడా చేయ‌డం విశేషం. కొత్తగా తెచ్చిన మార్పుల ప్రకారం భారత్ పొరుగు దేశాలైన పాకిస్థాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. నేరుగా చైనాపై ఆంక్ష‌లు విధిస్తే అంత‌ర్జాతీయంగా కొన్ని చిక్కులు ఎదుర‌వుతాయ‌నే దీర్ఘ‌కాలిక ఆలోచ‌న‌తోనే మిగ‌తా ఆసియా దేశాల‌ను కూడా ఎఫ్‌డీఐ ఆంక్ష‌ల ప‌రిధిలోకి తేవ‌డం గ‌మ‌నార్హం.


చైనా కేంద్ర బ్యాంకు అయిన పీపుల్స్ బ్యాంకు ఆఫ్ చైనా ఇటీవల హెడ్‌డీఎఫ్‌సీలో తనకున్న వాటాను 1.01 శాతానికి పెంచుకున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. కరోనా ధాటికి బలహీలనపడిన భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను తమకు అనుకూలంగా మలుచుకునే విధంగా  విదేశీ సంస్థల చేతుల్లోకి భారత‌ కంపెనీలు వెళ్ల‌కుండా ఉండేందుకే కేంద్ర ప్ర‌భుత్వం ఈ క‌ఠిన నిర్ణ‌యం అమ‌ల్లోకి తెచ్చింద‌ని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా భారత కంపెనీలపై చైనా ప్రాబల్యం పెరగకుండా ఉండేందుకు ఈ మార్పులు వచ్చాయని వాణిజ్య వేత్తలు అభిప్రాయపడుతున్నారు. భార‌త్‌లో చైనా కంపెనీల ఆధిప‌త్యాన్ని క్ర‌మంగా తగ్గించేందుకు ఇది ఆరంభ‌మేన‌ని చెప్పాల‌ని నిపుణులు పేర్కొంటున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: