దేశీయ మార్కెట్ల‌ను లాక్‌డౌన్ భ‌యాలు వెంటాడుతున్నాయి. దీంతో మార్కెట్ల నేడు కూడా ఊగిస‌లాట‌లోనే కంటిన్యూ అవుతున్నాయి. ఐరోపా దేశాలు వ‌రుస‌గా లాక్‌డౌన్ పెంచుతున్న‌ట్లుగా ప్ర‌క‌ట‌న‌లు చేస్తుండ‌టంతో పెట్టుబ‌డుదారుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌దుపు చేస్తే న‌ష్టాలు త‌ప్ప‌వ‌న్న భ‌యాందోళ‌న‌తోనే వారు ఉండ‌టం గ‌మ‌నార్హం.  అయితే రిలయన్స్ జియోలో ఫేస్‌బుక్‌ పెట్టుబడి వార్తతో మార్కెట్లు ప్రారంభంలో ట్రేడింగ్‌ను లాభాలతో ఆరంభించాయి. కానీ, కరోనా భయాలతో కొంత సమయానికే తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9.45 గంటల సమయంలో సెన్సెక్స్‌ 39 పాయింట్లు నష్టపోయి 30,597 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 21 పాయింట్లు కోల్పోయింది.

 

ప్ర‌స్తుతం 8,960 వద్ద ట్రేడవుతోంది. ఇక‌ డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.30 వద్ద కొనసాగుతోంది. ఫేస్‌బుక్‌ వాటాల కొనుగోలుతో రిలయన్స్‌ షేర్లు ఓ దశలో ఏడు శాతం మేర లాభపడ్డాయి. ఇన్ఫోసిస్‌, మారుతీ సుజుకీ ఇండియా, రిలయన్స్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హెచ్‌సీఎల్‌ , ఏషియన్‌ పెయింట్స్  షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. ఓఎన్‌జీసీ, వేదాంత, హిందూస్థాన్‌ పెట్రోలియం,  హిందాల్కో, భారత్‌ పెట్రోలియం, కోల్‌ ఇండియా రంగాల‌ షేర్లు వ‌రుస న‌ష్టాల‌ను మూట‌గ‌ట్టుకున్నాయి. మంగ‌ళ‌వారం కూడా దేశీయ మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిసిన విష‌యం తెలిసిందే.

 

బెంచ్‌మార్క్ సూచీలు మంగళవారం నిట్టనిలువునా కుప్పకూలాయి. గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పతనం కావడంతో ఆ ప్రభావం స్టాక్ మార్కెట్లపై గట్టిగానే పడింది. కరోనా వైరస్ వల్ల డిమాండ్ పడిపోవడం... తద్వారా క్రూడ్ నిల్వలు పేరుకుపోవడంతో క్రూడ్ ధరలు మైనస్‌లోకి వెళ్లిపోయాయి.  అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి నష్టాల్లో ట్రేడవుతోంది. 29 పైసలు నష్టంతో 76.83 వద్ద కదలాడుతోంది. ఇది ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి అని చెప్పాలి  అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 15.21 శాతం తగ్గుదలతో 21.66 డాలర్లకు క్షీణించింది. 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: