కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా ఎలా వణికిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఈ కరోనా రోజు రోజుకు పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు.. దీంతో కరోనా నియంత్రణకై మన దేశంతో పాటు ప్రపంచ దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. 

 

ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ కారణంగా ఓ వ్యక్తి కోట్లు సంపాదించాడు. అతను ఎవరు? ఎలా అనుకుంటున్నారా? అతను లి జిటింగ్. షెంజెన్ మైండ్రే బయో మెడికల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ చైర్మన్, కోఫౌండర్. ఈ కంపెనీ మెడికల్ ఎక్విప్‌‌మెంట్ తయారు చేస్తుంది.. అంతేకాదు.. వెంటిలేటీర్లను కూడా ఈ కంపెనీ తయారు చేస్తుంది. 

 

అయితే కరోనా కారణంగా బాగా సంపాదించాడు.. కంపెనీ షేర్ల ధర ఏకంగా రెట్టింపు అయ్యింది.. ఇంకా అతని సంపాదన 4.3 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 13.5 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో అతని ఆస్థి ఇప్పుడు ఏకంగా రూ.287 కోట్లకు చేరింది, దీంతో కంపెనీ మార్కెట్ వాల్యూ కూడా అమాంతం పెరిగిపోయింది. 

 

కరోనా దెబ్బతో బాగా ఎదిగిపోయాడు.. ప్రపంచ దేశాల నుండి అయన కంపెనీకి వెంటిలేటర్ల తయారీ ఆర్డర్ వస్తుంది.. ఇప్పటికే ఇటలీ నుండి దాదాపు 10,000 వెంటిలేటర్ల తయారీ ఆర్డర్ వచ్చింది. ఇంకా మిగితా దేశాల నుండి కూడా ఇలానే ఆర్డర్లు వస్తున్నాయి. కరోనా వైరస్ బాగా కలిసివచ్చింది అనే చెప్పాలి.                                                                                        

మరింత సమాచారం తెలుసుకోండి: