ప్రస్తుత రోజుల్లో ప్రతినెల క్రెడిట్ కార్డ్ ఉపయోగించేవారు చాలా ఎక్కువ అయ్యారనే చెప్పాలి. క్రెడిట్ కార్డు ఉపయోగించే వారికి కొన్ని బ్యాంకింగ్ సంస్థలు ఒక షాకింగ్ న్యూస్ తెలియజేశాయి. ఈనెల బిల్ చెల్లించకుండా మీలో ఎవరైనా మారటోరియం ఆప్షన్ ని ఎంచుకున్నారా...? ఇలాంటి వారి కార్డు లిమిట్ తగ్గిపోయే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి. ఈ ఆప్షన్ ఎంచుకున్న వినియోగదారులు అందరికీ చాలా వరకు లిమిట్ తగ్గిపోయాయని కంప్లైంట్లు ఎక్కువ శాతం ఆన్లైన్లో కనబడుతున్నాయి. కొందరికి క్రెడిట్ కార్డు లిమిట్ అయితే ఏకంగా 80 శాతం వరకు తగ్గిపోయింది అన్న కంప్లైంట్ చూసాము. 

 


ఇక కరోనా వైరస్ సంక్షోభం వల్ల క్రెడిట్ కార్డ్ బిల్లు పై మూడు నెలల మారటోరియం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించడం జరిగింది. ఈ ఆప్షన్ ఎంచుకున్న వారికి అందరికీ దాదాపు క్రెడిట్ కార్డు లిమిట్ భారీ స్థాయిలో తగ్గిపోయింది. అంతేకాకుండా ఆప్షన్ ఎంచుకున్న వారికి మాత్రమే కాకుండా పర్సనల్ లోన్స్ EMI లు వాయిదా వేసుకున్న వారికి కూడా... క్రెడిట్ కార్డు లిమిట్ భారీస్థాయిలో తగ్గిందనే చెప్పాలి. అంటే కస్టమర్ ఎవరైనా పర్సనల్ లోన్ పై మారటోరియం ఆప్షన్ ఎంచుకున్న క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తూ ఉంటే వారికి కూడా కార్డు లిమిట్ తగ్గిపోతుంది. అలాగే లిమిటెడ్ ఎక్కువ ఉన్నా క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు, లిమిట్ ఉపయోగించేవారికి నెలవారి క్రెడిట్ కార్డు లిమిట్ తగ్గిపోయింది. 

 

 

ఇక కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు అందరూ కూడా ఈ ఆప్షన్ ని ఎంచుకోవడం జరిగింది.. ఇలా EMI చెల్లించలేకపోతున్న వారి అందరి ఆర్థిక పరిస్థితిని ఆలోచిస్తూ ప్రముఖ బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇక క్రెడిట్ కార్డు బిల్లులు పర్సనల్ లోన్ లు, EMI లు ఎటువంటి ఇబ్బంది లేకుండా చెల్లించే వారు మాత్రమే ఈ ఆప్షన్ని ఎంచుకోవటం చాలా మంచిది అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక ఈ మారటోరియం ఆప్షన్ ఎంపిక చేసుకున్న వారు ప్రస్తుతానికి EMI వాయిదా వేసుకోవచ్చు కానీ... వడ్డీ మాత్రం ఖచ్చితంగా చెల్లించాల్సిందే. కనుక ఈ ఆప్షన్ ని ఎంపిక చేసుకునే ముందు.. జాగ్రత్తగా ఆలోచించి ఎంచుకోవడం మంచిది అంటూ విశ్లేషకులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: