సుధీర్ఘ‌కాలంగా భార‌త్‌లో లాక్‌డౌన్ అమ‌ల‌వుతుండ‌టంతో దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌త‌న‌మ‌వుతోంది. ప్రాణాలు కాపాడుకుంటూనే... ఆర్థిక ప‌త‌నం జ‌ర‌గ‌కుండా చూసుకోవాల్సిన బాధ్య‌త కేంద్ర ప్ర‌భుత్వంపై ఉంది. అయితే వ‌చ్చే ప‌ది రోజుల్లో లాక్‌డౌన్ ఎత్తివేయ కుంటే ఆర్థికంగా భార‌త్‌కు కోలుకోని న‌ష్టాలు ఎదుర‌వుతాయ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. భారత్‌ వృద్ధి అంచనాలు మరింత క్షీణిస్తే.. దేశ సార్వభౌమ రేటింగ్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుందని ఫిచ్‌ రేటింగ్స్ ఇటీవ‌ల విడుద‌ల చేసిన నివేదిక‌లో వెల్ల‌డించింది.  కొవిడ్‌-19 ప్రభావంతో వృద్ధి అంచనాలను తగ్గించిన నేప‌థ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ నిష్పత్తిలో భారత రుణభారం 77 శాతం పెరగొచ్చని అంచనా వేసింది. వాస్త‌వానికి  2019-20లో ఇది 70 శాతంగా ఉంది.


అయితే ప్ర‌స్తుతం ఆర్థికాభివృద్ధి నెమ్మదించడం, ద్రవ్యలోటు పెరగడంతో రుణ‌భారం 77శాతానికి ఎగ‌బాకుతుంద‌ని ఫించ్ స‌ర్వే అంచ‌నావేసింది. లాక్‌డౌన్‌ను మే 3కు పొడిగించిన నేపథ్యంలో వృద్ధిని గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్ర‌భుత్వం త‌ప్ప‌నిస‌రి చ‌ర్య‌ల్లో భాంగా మరిన్ని ఉద్దీప‌న చ‌ర్య‌ల‌కు పూనుకునే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌న‌బ‌డుతోంద‌ని నివేదిక‌లో పేర్కొంది.  అలాగే కొన్నేళ్లుగా ప్రభుత్వం ద్రవ్యలోటు లక్ష్యాన్ని అందుకోలేకపోతోందని నివేదిక‌లో గుర్తు చేసింది.  ఇదిలా ఉండ‌గా 2020-21లో జీడీపీలో భార‌త్‌ ద్రవ్యలోటు 3.5 శాతంగా అంచనా వేసింది.   లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికే ఆర్థికంగా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 34 రోజుల లాక్‌డౌన్ కారణంగా దేశ జీడీపీకి 10.2 లక్షల కోట్ల నుంచి రూ. 13.6 లక్షల కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అంచనా. 


అంతే కాదు ఉద్యోగాలపైనా తీవ్ర ప్రభావం పడనుంది. నిరుద్యోగ రేటు భారీగా పెరిగే అవకాశం ఉంది.లాక్‌డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు రోజుకు రూ.30-40 వేల కోట్ల నష్టం వాటిల్లుతోంద‌ని, 37.3 కోట్ల మంది శ్రామికులు రోజుకు రూ.10 వేల కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోతున్నార‌ని ఆర్థిక నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.  అంతేకాదు రు. లాక్‌డౌన్ కారణంగా ఇప్పటి వరకూ 34 రోజుల్లో రూ.2.4 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోయామ‌ని, 40 రోజుల తర్వాత కూడా లాక్‌డౌన్‌ను పొడిగిస్తే కరోనా కట్టడి చేయొచ్చేమో గానీ జీడీపీపై ప్రభావం పడే అవకాశం ఉంది. లాక్‌డౌన్ కారణంగా 10 కోట్ల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: