నేడు మళ్లీ దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. దీనితో దలాల్ స్ట్రీట్ దద్దరిల్లింది. నేడు కరోనా వైరస్ ‌కు మందు ప్రయోగాత్మక దశలో సానుకూల ఫలితాలనే ఇస్తోంది అన్న వార్తలు రావడంతో మార్కెట్ పరుగులు పెట్టింది. దీనితోపాటు కేంద్ర ప్రభుత్వం మరో రిలీఫ్ ప్యాకేజ్ ఫండ్ ఇస్తుందని అంచనాలు కూడా మార్కెట్ భారీ ర్యాలీకి దోహదపడ్డాయని చెప్పుకోవచ్చు. దీనితో నేడు సెన్సెక్స్ 997 పాయింట్ల లాభంతో 33,718 పాయింట్ల వద్ద క్లోజ్ అయ్యింది. అలాగే నిఫ్టీ 307 పాయింట్ల లాభంతో 9860 పాయింట్ల వద్ద ముగిసింది. 

 

ఇక నేటి మార్కెట్ విశేషాలు చూస్తే ... నిఫ్టీ 50 లో ONGC, వేదాంత, హిందాల్కో, టాటా మోటార్స్, UPL షేర్లు కాస్త లాభపడ్డాయి. ఇక ఇందులో టాటా మోటార్స్ ఏకంగా 20% లాభ పడింది. ఇక అదే సమయంలో ఇండస్ ఇండ్ బ్యాంక్, ITC, సన్ ఫార్మా, HUL, సిప్లా షేర్లు కాస్త నష్టపోయాయి. ఇక ఇందులో సన్ ఫార్మా 2% పైగా నష్టపోయింది. ఇక అలాగే నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌ లు మిశ్రమంగా ముగిసాయి. నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఫార్మా షేర్లు ఇండెక్స్ ‌లు నష్టపోగా, ఇక మిగతా ఇండెక్స్ లు అన్ని లాభాల బాట పడ్డాయి. ఇక నిఫ్టీ ఆటో ఏకంగా 6 % పైగా, నిఫ్టీ ఐటీ కూడా 5 %  లాభాల బాట పడ్డాయి. ఇక నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ ‌లు కూడా 2 % లాభపడ్డాయి. ఇందులో నిఫ్టీ మెటల్ దాదాపు 8 % లాభపడింది.

 

అలాగే అమెరికా డాలర్ ‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి కాస్త లాభాల్లో ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం 59 పైసలు లాభంతో 75.08 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌ లో  ముడి చమురు ధరలు ఈరోజు కూడా పెరిగాయి. అందులో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ ‌కు 8.87 % పెరిగి 26.39 డాలర్లకు, WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు 16.8% పెరగగా 17.62 డాలర్లకు చేరుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: