ప్రముఖ దేశీ దిగజ ప్రభుత్వ రంగ భీమా సంస్థ ఐనా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్  గురించి ప్రజలకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రజలలో lic  అంటే ఒక నమ్మకం.. అంతేకాకుండా lic లో డబ్బులు చాలా మంచిది అని అందరూ భావిస్తున్నారు. అందుకే ఎన్ని ప్రైవేటు వచ్చినా కూడా మార్కెట్ వాటా మాత్రం ఎటువంటి ఇబ్బంది రాలేదు. రోజురోజుకీ రకరకాల పాలసీలు వస్తున్నాయి వీటిల్లో టామ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఇక అసలు విషయానికి వస్తే lic  టర్మ్ ప్లాన్ ను మాత్రం ఆన్లైన్లోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ టర్మ్ ప్లాన్ తీసుకోవడంతో పాలసీదారుడు కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది.  ఈ పాలసీని ఏజెంట్ల వద్ద పొందడానికి వీలు లేదు.. ఆన్లైన్లోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

 


ఇక lic టర్మ్ ప్లాన్ ప్రీమియం లెక్కల ప్రకారం .. 30 సంవత్సరాల వయసు గల ఒక పాలసీదారుడు కొనుగోలు చేస్తే...అతనికి ప్రీమియం  రూ. 9912 లభిస్తుంది. ప్రీమియం 50 లక్షలు వరుకు వర్తిస్తుంది అని కంపెనీ తెలియజేసింది. ఇక కోటి రూపాయల కవరేజీ పాలసీ ఉంటే వారికి వార్షిక ప్రీమియం రూ.17,445 వర్తిస్తుంది. ఈ లెక్కల ప్రకారం lic టర్మ్ ప్లాన్ పాలసీ తో ఒక పాలసీదారుడు రోజుకు 27 రూపాయలు ఆదా చేస్తే 50 లక్షల వరకు కవరేజ్ వర్తిస్తుంది అని సంస్థ తెలియచేయడం జరిగింది. ఇకరోజుకు రూ.47 ఆదా చేస్తే మాత్రం రూ.కోటి కవరేజ్‌తో ఎల్‌ఐసీ పాలసీని కొనుగోలు చేయవచ్చు అంటూ అధికారులు తెలియచేస్తున్నారు.

 


ఒకవేళ టర్మ్ ప్లాన్ లో పాలసీదారుడు మరణిస్తే నుంచి రావాల్సిన డబ్బులు కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుంది. ఇక lic టర్మ్ ప్లాన్ 10-40 సంవత్సరాల కాల పరిమితి సంస్ధ నిర్ణయించడం జరిగింది.  ఈ పాలసీ తీసుకోవడానికి 10-65 సంవత్సరాల వయసు గల వారు అర్హులు అని టర్మ్ ప్లాన్ తెలియచేస్తుంది. గరిష్ఠంగా నా 80 ఏళ్ల వరకు  పాలసీ కవరేజ్ కూడా లభిస్తుంది అని అధికారులు తెలియచేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: