దేశంలోకొన్ని రాష్ట్రాలకు లాక్ డౌన్ విధానాన్ని సడలింపులు ఇవ్వడం జరిగింది. దీనితో ఈ - కామర్స్ దిగ్గజాలు ఆన్లైన్ లో అమ్మకాలు మొదలు పెట్టిన తరువాత ప్రముఖ మొబైల్ సంస్థ అయిన శాంసంగ్ తమ వినియోగదారులకు ఆఫర్లను ప్రకటించడం జరిగింది. లాక్ డౌన్ తర్వాత స్మార్ట్ ఫోన్ విక్రయాలు భారీ స్థాయిలో పడిపోతున్న నేపథ్యంలో ఈ ఆఫర్ ను  తీసుకురావడం జరిగింది. గెలాక్సీ A 20 సిరీస్ ఫ్రీ బుకింగ్ పై వోచర్ ఇస్తున్నట్లు కంపెనీ ప్రకటించడం జరిగింది. అదికూడా పరిమిత కాల ఆఫర్ 4,000 రూపాయలు విలువచేసే వోచర్ నమోదు చేసినట్లు సాంసంగ్ తెలియజేసింది. 

 


అంతేకాకుండా గెలాక్సీ ఎస్ 20 సిరీస్ అందుబాటులోకి తీసుకొని రావడం జరిగిందని సంస్థ తెలిపింది. శాంసంగ్ అధికారిక వెబ్ సైట్స్ లో ఉత్పత్తులను కొనుగోలు చేసుకోవచ్చు. కాకపోతే మే 20 వరకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది అని సంస్థ తెలియజేసింది. అంతేకాకుండా గెలాక్సీ ఎస్ 20 ఫ్రీ బుకింగ్ చేసుకునే వారికి కొత్త వినియోగదారులందరికీ సామ్సంగ్ గెలాక్సీ 20 బడ్స్ ప్లస్ లో భారీగా తగ్గింపుతో అందచేస్తునట్లు ప్రకటించడం జరిగింది. ఇక ప్రీ బుకింగ్ చేసుకునే వినియోగదారులకు 11990 రూపాయలు విలువ చేసే ఫోన్ కేవలం 1999 పొందవచ్చు. ఇక అంతేకాకుండా గెలాక్సీ ఎస్ 20 ప్రీ బుకింగ్ వినియోగదారులు గెలాక్సీ బడ్స్ ప్లస్ ను రూ.2,999 కే పొందవచ్చు. 


ఈ ఆఫర్  జూన్ 15 లోపు రెడీమ్ చేసుకునే అవకాశాలు కల్పించింది. జూన్ 15వ తేదీ వరకు రెడీమ్ చేసుకునేలా అనేక ఇతర ఆఫర్లను కూడా ప్రకటించింది. ఈ ఫోన్ బుకింగ్ చేసుకునే వినియోగదారులకు అదనంగా ఐదు వేల రూపాయలు బోనస్ అందజేస్తుంది. అలాగే పేమెంట్స్ hdfc క్రెడిట్ డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపితే ఆరువేల రూపాయలు కూడా లభిస్తుంది. మరి ఇంక ఎందుకు ఆలస్యం శాంసంగ్ వారికి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: