గల్ఫ్ దేశాల్లో చిక్కుకు పోయిన భార‌తీయుల‌ను స్వ‌దేశానికి తీసుకువ‌చ్చే ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. అందులో భాగంగానే గురువారం సాయంత్రం ఎయిరిండియాకు చెందిన రెండు విమానాలు కేరళ నుంచి బయల్దేరి వెళ్లాయి. ఇందులో ఒకటి సాయంత్రం 4 గంటల 15 నిముషాలకు కొచ్చి నుంచి అబుదాబి బయ‌ల్దేరి వెళ్లింది. అలాగే ఇది రాత్రి 9.40 కి తిరిగి కొచ్చి చేరుకుంటుంది. అలాగే కోజికోడ్ నుంచి మరో విమానం సాయంత్రం 5 గంటలకు వెళ్లింది. ఇది రాత్రి 10.40 కి తిరిగి కోజికోడ్ చేరుతుంది. అబుదాబిలో సుమారు 350 మంది భారతీయులున్న‌ట్లుగా ప్రాథ‌మికంగా అధికారులు గుర్తించారు. 


వీరికి సంబంధించిన జాబితాను ఇండియ‌న్ ఎంబ‌సీ సేక‌రించింది. ఇప్ప‌టికే అన్ని వైద్య ప‌రీక్ష‌లు పూర్తి చేసిన అక్క‌డి అధికారులు స్వ‌దేశానికి త‌ర‌లింపు ప్ర‌క్రియ‌ను మొద‌లుపెట్టారు. ఇక  మహిళలు, పిల్లలు మినహా పెద్దవారిని ఏడు రోజులపాటు సంస్థాగత క్వారంటైన్‌కు తరలిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఇదిలా ఉండ‌గా  మొదటి ఐదు రోజుల్లో గ‌ల్ఫ్ దేశాల్లో ఉన్న  దాదాపు రెండు వేల  మంది భారతీయులను స్వదేశానికి తీసుకురానున్నారు. వీరంతా కన్నూరు, కోజికోడ్, కొచ్చి, తిరువనంతపురం చేరుకోనున్నారు.వాస్త‌వానికి ముందుగా వీరిని జ‌ల‌మార్గం గుండా తీసుకురావాల‌ని కేంద్ర‌ప్ర‌భుత్వం భావించింది.


అయితే అందుకు గ‌ల్ఫ్ దేశాల నుంచి కొంత వారింపు వ్య‌క్తమ‌వ‌డంతో ఎయిర్ ఇండియా విమానాల ద్వారానే చివ‌రికి త‌ర‌లింపు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. కరోనా కారణంగా  గల్ఫ్ దేశాల్లో  పనులు ఆగిపోయాయి. వ‌ల‌స కూలీలుగా ప‌నిచేస్తున్న భార‌తీయులు స్వ‌దేశానికి తిరుగుముఖం ప‌ట్ట‌ని ప‌రిస్థితి. వాళ్లలో భారతీయులు, తెలుగువారు చాలా మంది ఉన్నారు. ఐతే... కేంద్ర ప్రభుత్వం విమాన సర్వీసులను ఆపేయడంతో... గల్ఫ్ దేశాల్లో ఇండియన్స్ పరిస్థితి గందరగోళంగా తయారైంది. చాలా రోజుల నిరీక్ష‌ణ త‌ర్వాత గ‌ల్ఫ్ కార్మికుల‌కు శుభ‌వార్త చేరింది. దీంతో అక్క‌డి శ్రామికులు, కార్మికుల్లో ఆనందం వ్య‌క్త‌మ‌వుతోంది.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: