ప్రస్తుత భారతదేశ నంబర్ 1 టెలికాం ఆపరేటర్ తన కష్టమెర్స్ కు జియో మరో 3 కొత్త వర్క్ ఫ్రం హోం ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనితో వినియోగదారులకు హైస్పీడ్ ఇంటర్నెట్ లభించబోతుంది. ఇక ఇందులో మొదటిది రూ.151 యాడ్ ఆన్ ప్యాక్. ఈ ప్యాక్ తో మనకు 30 Gb డేటాను జియో మనకు ఇవ్వబోతోంది. ఇక రూ.201 ప్యాక్ ద్వారా 40 Gb డేటా వినియోగదారులకు అందించబోతుంది. ఇకపోతే రూ.251 ప్యాక్ ద్వారా 50 Gb హైస్పీడ్ డేటాను అందిస్తున్నారు. ఇక అలాగే రోజువారీ డేటాను వేగంగా ఉపయోగించే వినియోగదారులకు ఈ ప్లాన్లు బాగా ఉపయోగపడనున్నాయి. ఈ ప్లాన్ల విషయంలో వ్యాలిడిటీ మీరు ప్రస్తుతం ఉపయోగించే ప్లాన్ వ్యాలిడిటీ గానే ఉండబోతుంది.

 

ఇక ఇప్పటికే జియోలో 4 డేటా యాడ్ ఆన్ ప్యాక్ లు అందుబాటులో మనకు లభిస్తున్నాయి. అందులో రూ.11, రూ.21, రూ.51, రూ.101 డేటా వోచర్లను జియో ఇప్పటికే కస్టమర్స్ కు అందిస్తోంది. ఇక ఈ ప్లాన్స్ చుస్తే,, రూ.11 ప్యాక్ ద్వారా 800 Mb డేటా, జియో నుంచి ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 75 నిమిషాలు ఇస్తున్నారు. అంతేకాకుండా రూ.21 ప్యాక్ ద్వారా 2 gb డేటా, ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 200 నిమిషాలు ఇస్తున్నారు. ఇక అదే రూ.51 ప్లాన్ ద్వారా 6 gb డేటా, ఇతర నెట్ వర్క్ లకు 500 నిమిషాలు మనకు ఇస్తున్నారు. వీటితోపాటు రూ.101 ప్లాన్ ద్వారా 12 gb డేటా, ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 1000 నిమిషాలు పొందుతున్నాము. 

 


ఇవన్నీ ఇలా ఉండగా అయితే ఇప్పుడు అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ వర్క్ ఫ్రం హోం ప్యాక్ ల ద్వారా కేవలం డేటా తప్ప ఇతర ప్రయోజనాలు లభించవు. ఇకపోతే రూ.251 ప్లాన్ కు భారీ మార్పులు చేసారు. జియో కంపెనీ ఇంతకుముందు రూ.251 ప్లాన్ ద్వారా రోజుకు 2 gb డేటాను 51 రోజుల పాటు మనకు ఇచ్చేది. అంటే మొత్తంగా చూస్తే 102 జీబీ డేటా వచ్చేది. ఇక ఇప్పుడు ఆ ప్లాన్ కు భారీ మార్పులు చేసింది జియో. ఇప్పుడు కేవలం ఈ ప్లాన్ ద్వారా కేవలం 50 gb డేటా మాత్రమే లభించనుంది. అంటే దీనితో వచ్చే లాభాలను దాదాపు సగం పైగా  కొత్త విధించింది జియో సంస్థ.

మరింత సమాచారం తెలుసుకోండి: