ఆన్‌లైన్‌ సెర్చ్‌, వ్యాపార ప్రకటన అంశాల్లో  ప్ర‌ముఖ ఆన్‌లైన్ సెర్చ్ ఇంజ‌న్‌ గూగుల్ సంస్థ దుర్వినియోగాల‌కు పాల్ప‌డుతోంద‌ని అమెరికాలోని ప్ర‌భుత్వ సంస్థ‌లు ఆగ్ర‌హంతో ఉన్నాయి. అమెరికా ప్ర‌భుత్వ సంస్థ‌లు, వాటి అనుబంధ సంస్థ‌లన్నీ కూడా  గూగుల్‌పై దావా వేయడానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం.  ఇదే విష‌యంపై  దర్యాప్తునకు దగ్గరి సంబంధమున్న గుర్తుతెలియని వ్యక్తులను ఉటంకిస్తూ ‘ద వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌’ ఇటీవ‌ల ఒక క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. గూగుల్ సంస్థ‌కు ఉన్న మంచి పేరు, అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంద‌ని క‌థ‌నంలో పేర్కొన‌డం గ‌మ‌నార్హం. వినియోగదారుల చట్టాలకు విరుద్ధం. వారి స్వేచ్ఛను, ఎంపికను ఈ సంస్థ హరిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

 

గూగుల్‌ వల్ల కొన్ని కంపెనీలు బాగా లాభాలు గడిస్తున్నాయని.. అయితే  వినియోగదారులు మాత్రం న‌ష్ట‌పోతున్నార‌ని అమెరికాలోని ప్ర‌భుత్వ సంస్థ‌లు ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా ముందుగా న్యాయ శాఖ గూగుల్‌పై  పిటిషన్‌ను దాఖలు చేయవచ్చని తెలుస్తోంది. ఆ తర్వాత టెక్సాస్‌ అటార్నీ జనరల్‌ కెన్‌ పాక్స్‌టన్‌, ఇతర రాష్ట్రాలకు చెందిన అటార్నీలు కూడా కేసులు వేయవచ్చని  ‘ద వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌’ త‌న క‌థ‌నంలో వివరించింది.  మ‌రోవైపు గూగుల్ సంస్థ త‌న వివ‌ర‌ణ‌ను గూగుల్ వైబ్‌సైట్‌లో పేర్కొంది. మే ప్ర‌జ‌ల‌కు ఎప్పుడు మంచి చేయాల‌నే చూస్తం. వేల కొద్దీ వ్యాపారులకు సేవలు అందించడంపైనే మా దృష్టి ఉంటుంది. పోటీని పెంచడానికి కట్టుబడి ఉన్నామ‌ని వివ‌రించింది.

 

ఇదిలా ఉండ‌గా గూగుల్‌ 2013లోనూ ఇదే తరహా ఆరోపణలను ఎదుర్కొంది. ఆ త‌ర్వాత ఇదే సంవ‌త్స‌రంలో మార్చిలో బ్ర‌స్స‌ల్స్‌లో న్యాయ‌స్థానం  పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. 1.49 బిలియన్‌ యూరోలు జరిమానా కింద చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. గూగుల్‌కు ఉన్న మంచి పేరు, అధికారాన్ని గూగుల్‌ దుర్వినియోగం చేసిందని తెలిపారు.  ఇదిలా ఉండ‌గా గూగుల్ ఒక గొప్ప సంస్థ‌. ఇలాంటి వివాదాస్ప‌ద వ్యాపార ధోర‌ణుల‌కు దూరంగా ఉంటే మంచిందంటూ నెటిజ‌న్లు స్పందిస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: