ప్రైవేట్ దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ.. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఆఫర్లు ఇచ్చిన ఈ బ్యాంక్ ఇప్పుడు మరో సరికొత్త బంపర్ ఆఫర్ ఇస్తుంది. అది ఏంటి అంటే? తన కస్టమర్లకు అదిరిపోయే డిస్కౌంట్స్ ని అందిస్తుంది. అయితే ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేయడం ద్వారా ఈ డిస్కౌంట్స్ పొందొచ్చు. 

 

అయితే ఈ డిస్కౌంట్ ఆఫర్ కేవలం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వినియోగించే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇంకా ఈ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డులతో ఈ కామర్స్ సైట్స్ లో షాపింగ్ చెయ్యడం వల్ల 2 వేలు వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు ఈఎంఐ ట్రాన్సాక్షన్లకు కూడా ఈ క్యాష్ బ్యాక్ వర్తిస్తుంది. 

 

అయితే ఈ డిస్కౌంట్ బంపర్ ఆఫర్ లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను అందిస్తుంది. అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు లావాదేవీలకు ఇది వర్తిస్తుంది. అలాగే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఈఎంఐ ట్రాన్సాక్షన్లకు ఇదే ఆఫర్ లభిస్తుంది. ఇంకా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డు లావాదేవీలకు రూ.500 ఫ్లాట్ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. 

 

అయితే ఈ డిస్కౌంట్ పొందడానికి తమ బ్యాంక్ కస్టమర్లు కనీసం 5 వేలు కొనుగోలు నిర్వహించాలి అని చెప్పారు.. ఇంకా ఉదాహరణకు మీరు పది వేలు కార్డుతో ఖర్చు చేస్తే మీకు పది శాతం అంటే వెయ్యి రూపాయిలు డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఈ అద్భుతమైన ఆఫర్ మరో రెండు రోజులు అంటే కేవలం ఈ నెల 27 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటానే ఆఫర్ ని పొందండి.                          

మరింత సమాచారం తెలుసుకోండి: