కరోనా వైరస్ కారణంగా దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ పాటించాయి. మందులేని ఈ వైరస్ నుండి ప్రజలను రక్షించడానికి ప్రపంచ దేశాలు లాక్ డౌన్ అమలులోకి తీసుకురావడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అన్ని రంగాలు క్లోజ్ అయిపోయాయి. లాక్ డౌన్ పరిస్థితి వల్ల అన్ని నష్టాలు చూశాయి. కానీ ఇలాంటి సమయంలో బాగా లాభపడింది మాత్రం ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు. ప్రజలెవరూ బయటకు రాలేని పరిస్థితి ఉండటంతో ఇంటర్నెట్ సదుపాయం తో ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు ప్రజలకు దిక్కయ్యాయి. దీంతో లాక్ డౌన్ టైమ్ లో భయంకరమైన లాభాలు ఊహించని రీతిలో సాధించాయి ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు.

 

ఇదిలా ఉండగా ప్రముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు అమెజాన్, ఫ్లిప్ కార్డ్ లకు పోటీ గా రిలయన్స్ జియో దిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇటీవలే జియో ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు ఇండియా లో ప్రధాన నగరాలు అయిన ముంబై మరియు పూణేలో జియో మార్ట్ ఆరంభించడం మనం చూశాం. అయితే ఈ సేవలు విస్తరించడానికి గాను  జియో యాజమాన్యం దేశంలో 200 పట్టణాలలో జియో మార్ట్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చి వినియోగదారులకు సేవలందించడానికి రెడీ అయింది. ఫేస్‌బుక్ జియోలో పెట్టిన పెట్టుబ‌డుల కార‌ణంగా వాట్సాప్ ద్వారా జియోమార్ట్ సేవ‌ల‌ను వినియోగ‌దారులు పొందే అవ‌కాశం ల‌భించింది.

 

వాట్సాప్‌లో త‌మ‌కు కావ‌ల్సిన స‌రుకుల‌ను ఆర్డ‌ర్ చేస్తే కొన్ని గంట‌ల్లోనే స‌రుకులు ఇంటి వ‌ద్ద‌కే డెలివ‌రీ వ‌స్తాయి. కాగా జియోలో కేవ‌లం ఫేస్‌బుక్ మాత్ర‌మే కాకుండా ప‌లు ప్ర‌ముఖ సంస్థ‌లు కూడా భారీ ఎత్తున వాటాల‌ను కొనుగోలు చేశాయి. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో జియో మార్ట్ సేవ‌ల‌ను దేశంలో మ‌రిన్ని ప్రాంతాల‌కు విస్త‌రించ‌నున్నారు. ఒక్క వాట్సాప్ మెసేజ్ తో సరుకుల మొత్తం ఇంటికి చేరే విధంగా అందుబాటులోకి రానున్న సేవలు ఈ విషయంలో జియో మార్ట్ మరిన్ని డిస్కౌంట్లు కూడా ఇస్తున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: