భారతదేశ అతిపెద్ద బ్యాంకు అయిన sbi మరోసారి తన కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. మరోసారి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ బ్యాంక్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంతో sbi బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసే వారి మీద ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఇదివరకు కంటే ఇప్పుడు sbi బ్యాంకులో డబ్బులు పెట్టుకుంటే తక్కువ రాబడి వస్తుంది.

IHG

 

ఇకపోతే తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఒక నెలలో రెండోసారి తగ్గించడం ఇదే మొదటిసారి. sbi తాజాగా ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను ఏకంగా 40 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించేసింది. ఇక అన్ని రకాల కాలపరిమితి లోనూ ఫిక్స్డ్ డిపాజిట్ లకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. దీనితో ప్రస్తుతం sbi ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు 4 శాతం నుండి మొదలు కాబోతున్నాయి. ఇకపోతే క్రితం వరకు 4.4 శాతం నుండి ఈ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు మొదలయ్యేవి.

 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బల్క్ డిపాజిట్లపై అనగా 2 కోట్లు, ఆపైన వాటికి ఏకంగా 50 బేసిస్ పాయింట్లు వరకు తగ్గించేసింది. ఇకపోతే తాజాగా వడ్డీరేట్ల కోతతో sbi ఖాతాదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. తాజా వడ్డీరేట్ల నిర్ణయంతో sbi బ్యాంక్ మే 27 నుంచి ఈ కొత్త రూల్స్ ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇకపోతే ప్రస్తుతం ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 5.4 శాతం వరకు మాత్రమే వడ్డీని అందించబడుతుంది.

 

ఇంతకు ముందు ఇది 5.5 శాతంగా ఉండాలి. సాధారణ, మధ్యతరగతి ప్రజల వరకు అతి తక్కువ డిపాజిట్ తో అకౌంట్ ను ఓపెన్ చేసి సేవలు అందించే బ్యాంక్ ఇలా చేయడం నిజంగా బాధ పడాల్సిన విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: