నేడు దేశ మార్కెట్లు దుమ్ము రేపాయి. దేశీయ మార్కెట్లో అన్ని బెంచ్మార్క్ సూచీలు పరుగులు పెట్టాయి. దాదాపు అన్ని రంగాల్లో లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల షేర్లలో బలమైన కొనుగోలు కారణంగా గురువారంనాడు మార్కెట్ పరుగులు పెట్టింది. అన్ని ఇండెక్స్ లో దాదాపు రెండు శాతం మేర లాభాల బాట పట్టాయి. ఇక ఇంట్రాడేలో సెన్సెక్స్ 593 పాయింట్లు ర్యాలీ చేయగా చివరకు 32200 పాయింట్లకు చేరింది. అలాగే లెఫ్ట్ కూడా 9490 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక చివరకు BSE సెన్సెక్స్ 594 పాయింట్ల లాభంతో 32201 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక అలాగే NSE నిఫ్టీ కూడా 173 పాయింట్ల లాభంతో 9408 పాయింట్ల వద్ద ముగిసింది.


ఇక నేటి మార్కెట్ విశేషాల లోకి వస్తే.... నిఫ్టీ 50 లో L & T, హీరో మోటొకార్ప్, hdfc బ్యాంక్, జీ ఎంటర్టైన్మెంట్, ఐషర్ మోటార్స్ లాభాలలో ముగిసాయి. ఇకపోతే ఇందులో జీ ఎంటర్టైన్మెంట్ షేర్లు 9 శాతం పెరిగాయి. ఇక అదేసమయంలో sbi, JSW స్టీల్, విప్రో, ఐటీసీ, సిప్లా షేర్లు నష్టపోయాయి. ఇందులో విప్రో 1 శాతం వరకు పడిపోయింది. ఇక నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్ లు అన్ని మిశ్రమంగా క్లోజ్ అయ్యాయి. ఒక్క నిఫ్టీ PSU బ్యాంక్ ఇండెక్స్ మినహా మిగతా సూచీలన్నీ లాభాల్లోనే ముగిసాయి. ఇకపోతే నిఫ్టీ ఆటో, నిఫ్టీ మీడియా ఇండెక్స్ ‌లు 3 % పైగా ర్యాలీ చేశాయి. ఇక  నిఫ్టీ మెటల్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ ‌లు 2 % లాభపడ్డాయి.


ఇక అలాగే అమెరికా డాలర్ ‌తో పోలిస్తే భారత రూపాయి స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతింది. కేవలం 4 పైసలు నష్టంతో 75.76 వద్ద ట్రేడ్ కొనసాగుతుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్ ‌లో ముడి చమురు ధరలు కాస్త మిశ్రంగా కదిలాయి. ఇందులో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ ‌కు 0.92 % పెరుగుదలతో 34.94 డాలర్లకు చేరగా, WTI క్రూడ్ ధర బ్యారెల్‌ కు 1.77 % నష్టంతో 32.24 డాలర్లకు చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: