రోజురోజుకీ కరోనా వైరస్ ప్రభావం ప్రపంచం మొత్తం ఎక్కువ అయిపోతుంది. దీనితో ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏ పని చేసుకోవాలన్న, ఎక్కడికైనా బయటకి వెళ్లి పనులు చేసుకోవాలన్న చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంతేకాకుండా అనేకమంది వారి జీవనాన్ని కోల్పోయారు. దీనితో ప్రజలు తిండి కూడా దొరక్క అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

 


ఇక మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభంతో చాలా దేశాలు విలవిల్లాడుతున్నాయి. అంతే కాకుండా అనేక వ్యాపార సంస్థలు ఈ సంక్షోభం దెబ్బకి ఉద్యోగులను తొలగించాయి. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ కూడా చేరింది. అమ్మకాలు పూర్తిగా తగ్గిపోవడంతో తన కంపెనీలో పని చేసే 15 వేల మందిని తొలగిస్తున్నట్లు శుక్రవారంనాడు కంపెనీ తెలియజేసింది. అంతేకాకుండా కొన్ని ప్లాంట్స్ ను పునర్వ్యవస్థీకరణ చేస్తాము అని ఎందుకు యూనిట్లతో చర్చలు జరుపుతున్నట్లు ఆ కంపెనీ తెలియజేసింది.

 


ఇంత మొత్తంగా తన కంపెనీ నుండి మొత్తంగా 15 వేల మందిని తొలగించింది. ఇక తమ సొంత దేశం అయినా ఫ్రాన్స్ లోనే ఏకంగా 4600 మందిని ఉద్యోగాల నుంచి తీసేసారు. ఇక మీదట దేశాల్లో పదివేల మంది పైగా వారిని తీసేశారని కంపెనీ తెలియజేసింది. ఈ సంస్థ కింద ప్రపంచ వ్యాప్తంగా ఒక లక్షా ఎనభై వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు.

 

ఇక అందులో ఇప్పుడు 15 వేల మందిని తొలగించినట్లు కంపెనీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు వారి నష్టాలను తగ్గించుకోవడానికి ఉద్యోగుల జీతాల ను తగ్గించడం లేదా ఉద్యోగులను తొలగించడం చేస్తున్నాయి. ఇప్పటికే అనేక దేశాల్లోని అనేక కంపెనీలు ఇలా ప్రకటించాయి. పెద్ద సంస్థలు, చిన్న సంస్థల అని తేడా లేకుండా అన్ని సంస్థలలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: