గతవారం స్టాక్ మార్కెట్లు బాగా లాభాల బాట పట్టిన సంగతి అందరికీ విదితమే. దీనితో సెన్సెక్స్ దాదాపు ఆరు శాతం లాభపడింది. ఇకపోతే 50 రోజుల నుంచి ఇదే అత్యధిక లాభం అని చెప్పవచ్చు. మరోవైపు నిఫ్టీ కూడా మూడు వారాల నష్టాలకు చెక్ చెబుతూ 6 శాతం లాభపడింది. నాలుగు రోజుల పాటు సాగిన ట్రేడింగ్ లో బ్యాంకుల కారణంగా లిఫ్ట్ ఈ రోజురోజుకు బలపడుతూ వచ్చింది. ఈ దెబ్బతో ఏకంగా 12 శాతం లాభపడింది నిఫ్టీ బ్యాంక్.

IHG


ఇకపోతే గతవారం ఐదు షేర్లు ఇన్వెస్టర్లను బాగా ఆకట్టుకున్నాయి. అవేమో ఇప్పుడు చూద్దామా.... మొదటగా ఈఐడి ప్యారి. ఈ కంపెనీ నీ కోరమాండల్ ఇంటర్నేషనల్ లో రెండు శాతం వాటాను విక్రయించాలని అని చూస్తోంది. దానితో ఆ కంపెనీ రుణ చెల్లింపులను చేపట్టి రుణ రహిత కంపెనీగా ఆవిర్భవించాలని భావిస్తోంది. అలాగే బిర్లా కార్పొరేషన్. ఈ షేర్ గతవారం ఒక్కటే 25శాతం జంప్ చేసింది. క్యూ 4 ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండడంతో ఇందుకు దోహదం చేసింది. 


ఇక మరో కంపెనీ ఫ్యూచర్ రిటైల్. మార్పిడి రహిత డిబెంచర్ల ద్వారా 650 కోట్లను సమీకరిస్తోంది నట్లు వెల్లడించిన ఫీచర్ రిటైల్ గతవారం 21 శాతం లాభపడింది. ఇక అందరి దృష్టి ఆకట్టుకునేది వొడాఫోన్ ఐడియా. ఈ కంపెనీ ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ కంపెనీ లో ఇన్వెస్ట్ చేయనున్న వార్తలతో మొబైల్ సంస్థ అయిన వోడాఫోన్ ఐడియా గతవారం 18 శాతం పరుగులు తీసింది. అలాగే ఐషర్ మోటార్స్ కూడా గతవారం మదుపర్లను ఆకర్షించింది. ఇందులో పది రూపాయల విలువ గల పేరును విభజించాలని ప్రతిపాదనలు వెళ్లడంతో ఆటో రంగ దిగ్గజం ఐషర్ మోటార్స్ 17 శాతం పైగా లాభపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: