లాక్ డౌన్ ఎఫెక్ట్.. బళ్ళు ఓడలు.. ఓడలు బళ్ళు అవుతున్నాయి. అవును.. మనం ఎంత అనుకున్న సరే ఇది నిజంగా జరుగుతుంది. సాధారణంగా చేతిలో డబ్బులు ఉంటే ఎక్కడ మాయం అవుతాయో అని ఫిక్సెడ్ డిపాజిట్ చేయాలి అనుకుంటాం. ఫిక్స్డ్ డిపాజిట్ అనగానే మనకు గుర్తొచ్చేది ఎస్బిఐ, ఇంకా హెడీఎఫ్సీసి. ఈ రెండు బ్యాంకుల్లో మనం డిపాజిట్ చేస్తే లాభాలు ఎక్కువ వస్తాయి అని మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు అతి దారుణంగా పడిపోయాయి. 

 

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. ఇప్పుడు ఎస్‌బీఐ అకౌంట్లపై ఏడాదికి 2.7 శాతం వడ్డీ వస్తుంది. అలాగే రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో కూడా వడ్డీ రేట్లు భారీగా తగ్గాయి. ఈ బ్యాంక్‌లో 3.25 శాతం వడ్డీ లభిస్తుంది. 

 

అయితే కొన్ని బ్యాంకులు మాత్రం ఫిక్సెడ్ కి అధిక వడ్డీ రేటును అందిస్తున్నాయి. 7.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి. చాలా బ్యాంకుల ఎఫ్‌డీ వడ్డీ రేట్ల కన్నా ఇది ఎక్కువ. ఆర్బీఐ సైతం వడ్డీ రేట్లను దారుణంగా తగ్గించేశాయి. దాదాపు 11కుపైగా బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలపై అధిక వడ్డీని అందిస్తున్నాయి. ఆ బ్యాంకుల లిస్ట్ ఇదే.. 

 

బంధన్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లపై 7.15 శాతం వరకు వడ్డీ అందిస్తోంది. 

 

ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా 6.75 శాతం వరకు వడ్డీని అందిస్తోంది.

 

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.5 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది.

 

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ కూడా గరిష్టంగా 6.5 శాతం వడ్డీని అందిస్తోంది. 

 

సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్‌ బ్యాంక్‌లో 6.25 శాతం వరకు వడ్డీ అందిస్తోంది. 

 

ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గరిష్టంగా 7 శాతం వడ్డీని అందిస్తోంది. 

 

ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7 శాతం వరకు, ఈక్విటస్ స్మా్ల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.5 శాతం వరకు వడ్డీని ఇస్తుంది. 

 

చూశారుగా.. ఈ బ్యాంకులు ఎంత వడ్డీ ఇస్తున్నాయో.. ఎస్బిఐ కంటే ఎక్కువ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు ఇవే. 

మరింత సమాచారం తెలుసుకోండి: