పాన్ కార్డు.. దీని ప్రత్యేకత గురించి చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయులకు కావాల్సిన కీలకమైన డాక్యుమెంట్లలో పాన్ కార్డు ఒకటి. ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డును జారీ చేస్తుంది. అయితే 10 నిమిషాల్లోనే పాన్ కార్డు పొందవచ్చు. దీనికి సంబంధించిన సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే లాంచ్ చేసింది. 

 

అయితే ఇలా నిమిషాల్లో పాన్ కార్డు కావలి అంటే కచ్చితంగా ఆధార్ కార్డు రావాలి. ఈ కార్డు కోసం ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌కు వెళ్లి అక్కడ ఇన్‌స్టంట్ పాన్ త్రూ ఆధార్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. అనంతరం దానిపై క్లిక్ చేసి గెట్ న్యూ ఆధార్ ఆప్షన్ ని క్లిక్ చెయ్యాలి. అనంతరం ఆధార్ నెంబర్, ఓటీపీ వంటి వివరాలు ఎంటర్ చేస్తే పది నిమిషాల్లో పాన్ నెంబర్ పొందవచ్చు. 

 

IHG

 

అయితే ఇలా వచ్చే పాన్ కార్డుకు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. పీడీఎఫ్ ఫార్మాట్‌లో పాన్ కార్డును సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా దాన్ని జిరాక్స్ తీసుకోవాలి అనుకుంటే 50 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది. అంతే ఆ పాన్ కార్డు నాలుగు రోజుల్లో మీ ఇంటికి వస్తుంది. 

 

అయితే పాన్ కార్డు ఇలా క్షణాల్లో పాన్ కార్డు పొందటం అందరికీ సాధ్యం కాదు. ఎందుకు అంటే ఇన్‌వాలీడ్ ఆధార్ కార్డు కలిగిన వారికి పాన్ కార్డు ఇన్‌స్టంట్ సేవలు అందుబాటులో లేవు. వాలిడ్ ఆధార్ కార్డు కచ్చితంగా ఉండాలి. అంతేకాదు ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ కచ్చితంగా లింక్ అయ్యి ఉండాలి. లేదు అంటే పాన్ కార్డు రాదు.                                  

మరింత సమాచారం తెలుసుకోండి: