లాక్ డౌన్ అంత పెరగని పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు గత కొద్దిరోజులుగా భారీగా పెరుగుతూ వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు 100 రూపాయిలు దాటే అవకాశం ఎక్కువగా ఉంది అని అంటున్నారు మార్కెట్ నిపుణులు. పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ భారీగా పెరగడంతో మన దేశంలో కూడా ధరలు భారీగా పెరిగాయి. 

 

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 1.16 శాతం తగ్గుదలతో 40.07 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 2.19 శాతం తగ్గడంతో 37.16 డాలర్లకు తగ్గింది. దీంతో ఇప్పుడు హైదరాబాద్‌లో శుక్రవారం లీటరు పెట్రోల్ ధర 55 పైసలు పెరుగుదలతో రూ.80.77కు, డీజిల్ ధర 63 పైసలు పెరుగుదలతో రూ.74.70కు చేరింది.             

 

IHG

 

ఇంకా అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే కొనసాగుతుంది. పెట్రోల్‌ ధర 53 పైసలు పెరుగుదలతో రూ.81.19కు చేరింది. డీజిల్‌ ధర కూడా 60 పైసలు పెరుగుదలతో రూ.75.14కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే కొనసాగుతుంది. పెట్రోల్ ధర 53 పైసలు పెరుగుదలతో రూ.77.81కు, డీజిల్ ధర కూడా 64 పైసలు పెరుగుదలతో రూ.76.43కు చేరింది. 

 

ఇలా గత 13 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయ్. లాక్ డౌన్ అంత స్థిరంగా కొనసాగిన పెట్రోల్ డీజిల్ ధరలు కేవలం 13 రోజుల్లో 7 రూపాయిలు పెరిగింది. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు ఒకరోజు పెరిగితే మరో రోజు తగ్గుతూ వస్తాయి. ఇలా నేడు పెట్రోల్, డీజిల్ ధరలు కొనసాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: