పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు కూడా పెట్రోల, డీజిల్ ధరలు పెరిగాయి. గత 18 రోజులుగా వరుసగా పెరుగుతూనే వస్తున్నాయి. ఇంకా మరో వైపు అంతర్జాతీయ మార్కెట్‌లోను ముడి చమురు ధరలు తగ్గాయిని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.      

 

అయితే లాక్ డౌన్ లో ఒక్క రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు.. తగ్గలేదు.. స్థిరంగా కొనసాగాయి. అయితే లాక్ డౌన్ ఎత్తివేసిన సమయం నుండి పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇంకా ఇప్పుడు అలానే పెరుగుతూ వస్తున్నాయి. మరి ఇలానే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ ఉంటే 100 రూపాయలకు చేరుతుంది. మరి ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయ్ అనేది ఇక్కడ చూద్దాం. 

 

ఇంకా ఈరోజు బుధువారం లీటరు పెట్రోల్ ధర 20 పైసలు పెరుగుదలతో రూ.82.79 పైసలకు, డీజిల్ ధర 54 పైసలు పెరుగుదలతో రూ.77.60 పైసాలకు చేరింది. ఇంకా అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే కొనసాగుతుంది. పెట్రోల్‌ ధర 54 పైసలు పెరుగుదలతో రూ.82.19కు, డీజిల్‌ ధర కూడా 64 పైసలు పెరుగుదలతో రూ.76.96కు చేరింది.                  

 

దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధర 65 పైసలు పెరుగుదలతో రూ.78.41కు, డీజిల్ ధర కూడా 64 పైసలు పెరుగుదలతో రూ.76.43కు చేరింది. ఇలా గత పదిహేను రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయ్. మరి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయి అనేది చూడాలి.                                        

మరింత సమాచారం తెలుసుకోండి: