అవును.. రుణ గ్రహీతలకు ప్రధాని మోదీ సూపర్ గుడ్ న్యూస్ చెప్పాడు. మంచి రుణాలు వడ్డీ రేట్ల రాయితీకి శుభవార్త తెలిపింది. అయితే శిశు లోన్ కేటగిరి కింద రుణాలు తీసుకునే వారికి 2 శాతం వడ్డీ రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది. ప్రధాన మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈరోజు ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. 

 

ప్రధాని నరేంద్ర మోదీ 2015 ఏప్రిల్ 8న ముద్రా యోజన స్కీమ్‌ను తీసుకువచ్చారు. అయితే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.10 లక్షల వరకు రుణం ఇవ్వాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకువచ్చారు. అయితే బ్యాంకులు, ఆర్ఆర్‌బీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఎంఎఫ్‌ఐలు ఈ తరహా రుణాలు ఇస్తున్నాయి. 

 

అయితే మోదీ తీసుకువచ్చిన ఈ ముద్ర యోజన స్కీమ్ కింద మూడు రకాల కేటగిరిల కింద రుణాలు పొందొచ్చు. ఆ కేటగిరిలు ఏంటి అంటే? శిశు, కిషోర్, తరుణ్ అనేవి ఆ కేటగిరీలు. 

 

ఇంకా శిశు కేటగిరి కింద రూ.50,000 వరకు రుణం పొందొవచ్చు. 

 

కిషోర్ కేటగిరి కింద రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణం పొందవచ్చు. 

 

తరుణ్ విభాగం కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణం పొందొవచ్చు.

 

అయితే కేంద్ర ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం కరోనా వైరస్ శరవేగంగా విస్తరించడమే కారణం అని అంటున్నారు. ఇంకా ఈ కరోనా నేపథ్యంలో వ్యాపారం చేయాలని భావించే వారికి ఈ నిర్ణయం ఊరటనిస్తుంది అనే చెప్పాలి. ఈ కరోనా వల్ల నష్టపోయిన చిరు వ్యాపారులకు ఈ నిర్ణయం మంచిఫలితం ఇస్తుంది.                                   

మరింత సమాచారం తెలుసుకోండి: