పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత దారుణంగా పెరుగుతున్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. గత 18 రోజులుగా ఆగకుండా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా అంతర్జాతీయ మార్కెట్ లోను ముడి చమురు ధరలు తగ్గాయి అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి ఇంకా పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. 

 

అయితే లాక్ డౌన్ లో ఒక్క రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు.. తగ్గలేదు.. స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే లాక్ డౌన్ ఎత్తివేసిన సమయం నుండి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మరి ఇలానే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ ఉంటే 100 రూపాయలకు చేరేలా కనిపిస్తుంది.

 

ఇంకా ఈరోజు గురువారం లీటరు పెట్రోల్ ధర 17 పైసలు పెరుగుదలతో రూ.82.96 పైసలకు, డీజిల్ ధర 59 పైసలు పెరుగుదలతో రూ.78.19 పైసాలకు చేరింది. ఇంకా అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే కొనసాగుతుంది. పెట్రోల్‌ ధర 34 పైసలు పెరుగుదలతో రూ.82.39కు, డీజిల్‌ ధర కూడా 44 పైసలు పెరుగుదలతో రూ.77.56కు చేరింది. 

 

దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధర 65 పైసలు పెరుగుదలతో రూ.78.41కు, డీజిల్ ధర కూడా 64 పైసలు పెరుగుదలతో రూ.76.43కు చేరింది. ఇలా గత పదిహేను రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయ్. మరి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయి అనేది చూడాలి.                                                                     

మరింత సమాచారం తెలుసుకోండి: