బంగారాన్ని కొన్ని ఏళ్లుగా పెట్టుబడిగా ప్ర‌జ‌లు భావిస్తూ కొనుగోలు..అమ్మ‌కాల‌కు శ్రీకారం చుట్టిన నాటి నుంచి  ధ‌ర‌లు కూడా హెచ్చు త‌గ్గుల‌కు లోను కావ‌డం గ‌మ‌నిస్తూనే ఉన్నాయి.  క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో అన్నింటి ధ‌ర‌లు పెరుగుతూనే ఉన్నాయి. అయితే విలాస‌వంత‌మైన వ‌స్తువుల  డిమాండ్ లేక పోవ‌డంతో ధ‌ర‌లు ప‌డిపోతుండ‌టాన్ని మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. అయితే బంగారం ధ‌ర‌లు మాత్రం రోజురోజుకు పైపైకి ఎగ‌బాకుతున్నాయి. అయితే ఇటీవ‌ల కాస్త తగ్గినట్టు కనిపించిన బంగారం ధరలు హైదరాబాద్ లో మళ్ళీ పెరిగాయి. వెండి ధరలు కూడా స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. సోమవారం బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శనివారం నాటి ధరల కంటే పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 230 రూపాయలు పెరిగింది. దీంతో 46,410 రూపాయల వద్ద నిలిచింది. 

 

అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.230 పెరుగుదలతో రూ.50,620కు ఎగసింది. ఇది బంగారానికి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి అని చెప్పుకోవచ్చు. పసిడి ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.410 పైకి కదిలింది. దీంతో ధర రూ.48,110కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.కేజీ వెండి ధర శనివారం నాటి ధరల కంటే 340 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 48వేల మార్కు దాటి ఎగసింది. కేజీ వెండి ధర 48,110 రూపాయలకు చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నంలలో.. ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. 

 

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పైకి కదిలింది. పసిడి ధర ఔన్స్‌కు 0.35 శాతం పెరిగింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1786 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.15 శాతం పెరుగుదలతో 18.07 డాలర్లకు ఎగసింది. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయ‌ని ఈ రంగంలోని వ్యాపార నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: