అవును ఆ బ్యాంకు కస్టమర్లకు సూపర్ గుడ్ న్యూస్ అందింది. ప్రైవేట్ రంగ ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్లకు ఈ శుభవార్త చెప్పింది. రుణ రేట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో బ్యాంక్ నుండి ఋణం తీసుకున్న వారికీ ఈ ప్రయోజనం లభిస్తుంది. అయితే ఈ బ్యాంకులో కొత్తగా తీసుకునే రుణాలపై కూడా వడ్డీ రేట్లు భారీగా తగ్గనున్నాయి. 

 

IHG

 

ఇంకా ఐసీఐసీఐ బ్యాంకు రుణ రేట్లు 0.15 శాతం తగ్గించింది. హోమ్ లోన్, వెహికల్ లోన్, పర్సనల్ లోన్ తీసుకున్న వారికి ఈఎంఐ భారం తగ్గనుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఒకటే కాదు ఇతర రుణ రేట్లు కూడా తగ్గనున్నాయి. కాగా ఐసీఐసీఐ బ్యాంక్ గత నెలలో అన్ని రకాల డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లను తగ్గించేసింది.               

 

IHG

 

0.25 శాతం కోత విధించింది. దీంతో ఐసీఐసీఐ బ్యాంక్‌లో డబ్బులు డిపాజిట్ చేసే వారు 3 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. రూ.50 లక్షల లోపు డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. ఇంకా దానిపై ఉన్న డిపాజిట్లకు అయితే 3.5 శాతం వడ్డీ లభిస్తుంది. కాగా ఏడాది నుండి ఎఫ్‌డీలపై వడ్డీ రేటు ఏకంగా 5.15 శాతానికి తగ్గింది. రూ.5 కోట్లలోపు ఎఫ్‌డీలకు ఇది వస్తుంది. మరి ఇంకేందుకు ఆలస్యం.. మీకు లోన్ అవసరం ఉంటే ఇప్పుడే అప్లై చేసుకోండి. 

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: