కేంద్రం ఉద్యోగులకు, మధ్యతరగతి ప్రజలకు శుభవార్త చెప్పింది. వీరందరికీ ఊరట కలిగే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. స్మాల్ సేవింగ్ స్కీమ్స్ పై వడ్డీరేట్లు తగ్గుతాయని గతంలో వార్తలు వచ్చినా వడ్డీ రేట్లను యథావిథిగా కొనసాగిస్తున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటన చేసింది. జూలై నుంచి సెప్టెంబర్ త్రైమాసికానికి ఈ వడ్డీరేట్లు వర్తించనున్నాయి. తాజాగా మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రజలకు ప్రయోజనం కలగనుంది. 
 
ఇటీవల వెలువడిన చాలా నివేదికల్లో స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లు దిగివస్తాయని తేలింది. కేంద్ర ప్రభుత్వం వీటన్నింటికీ షాకిస్తూ.. వడ్డీ రేట్లను స్థిరంగానే కొనసాగించనుంది. కేంద్రం తాజా నిర్ణయంతో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ పై 7.1 శాతం, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ 7.4 శాతం వడ్డీరేటు లభించనుంది. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లపై 5.5 శాతం నుంచి 6.7 శాతం మధ్యలో వడ్డీ పొందే అవకాశం ఉంటుంది. 
 
కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌లో చేరిన వారికి 6.9 శాతం వడ్డీ లభించడంతో పాటు స్కీమ్‌లో చేరిన వారి డబ్బు 124 నెలల్లో డబుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లో చేరిన వారికి 7.6 శాతం వడ్డీ లభించనుంది. మోదీ సర్కార్ ఏప్రిల్- జూన్ త్రైమాసికానికి సంబంధించి స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. ఏకంగా 1.4 శాతం వరకు కోత విధించింది. 
 
దీంతో తాజాగా వడ్డీరేట్లు కోత విధించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. గతంలో విధించిన కోతల వల్లే పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారికి తక్కువ రాబడి వస్తూ ఉండటంతో మరోసారి కోత విధిస్తే మరిన్ని ఇబ్బందులు తప్పవని ప్రచారం జరిగింది. అయితే కేంద్రం వడ్డీరేట్లతో ఎలాంటి కోతలు విధించకపోవడం మధ్య తరగతి ప్రజలు, ఉద్యోగులకు ఊరటనిస్తోందని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: