అవును.. మనం అనుకుంటాం కానీ స్టాక్ మార్కెట్ మాములు విషయం కాదు. ఒకసారి లాభాలు వస్తాయి.. మరోసారి నష్టాలు వస్తాయి. అన్ని అదృష్టంపై అవుతాయో లేదో తెలియదు కానీ.. ఇలాంటివి మాత్రం అదృష్టంపైనే నిలబడి ఉంటాయి. ఇంకా ఈ నేపథ్యంలోనే ఒక 5 నెలల క్రితం 15 రూపాయిలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పటికి 1500 వందల రూపాయిలు వచ్చేది. 

 

అసలు ఎక్కడ ఏమైంది అంటే? ఎఫ్ఎంసీజీ దిగ్గజం రుచి సోయా ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లపై ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ కళ్లు చెదిరే లాభం వచ్చేది. కొన్ని నెలల క్రితం కంపెనీ దివాలా తీసింది. ఈ నేపథ్యంలోనే పతంజలి ఆయుర్వేద్ ఈ కంపెనీని కొనుగోలు చేసింది. దీంతో ఆ కంపెనీ షేర్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 

 

రుచి సోయా కంపెనీ జనవరిలో మళ్లీ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యింది. అప్పటి నుంచి ఈ కంపెనీ షేరు ధర పరుగులు పెట్టింది. గత ఐదు నెలల కాలంలో ఈ షేరు ధర ఏకంగా 8,800 శాతం ర్యాలీ చేసింది. అంతే జనవరి 27న ఈ కంపెనీ షేరు ధర రూ.16గా ఉంది. ఇంకా ఇప్పుడు ఈ షేరు ధర ఏకంగా రూ.1,507 స్థాయికి తాకింది. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి.                   

 

అంటే ఐదు నెలల కిందట మీరు ఈ షేరులో రూ.16 పెట్టి ఉంటే ఇప్పుడు మీకు రూ.1,500 వచ్చి ఉండేవి. ఇంకా మీరు రూ.16,000 పెట్టి 1,000 షేర్లను కొనుగోలు చేసి ఉంటే మీకు రూ.15 లక్షలు వచ్చేవి. లక్షల్లో అధికం ఉండేది. ఏది ఏమైనా ఈ షేర్లు పెరగడం అనేది అంత కూడా అదృష్టం మీద ఆధారపడి ఉంది. మరి మీరు ఎం అంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: