డబ్బు సంపాదించాలి అని అందరూ అనుకుంటారు.. కానీ ఏ బిజినెస్ పెడితే ఏ నష్టం వస్తుందో అని అందరూ వెనకడుగు వేస్తారు. అయితే రిస్క్ లేకుండా డబ్బు సంపాదించాలనుకునే వారికీ కొన్ని అద్భుతమైన స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అవి ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) స్కీంలో రెండు రకాల అకౌంట్లు ఉన్నాయి. అయితే ఆ అకౌంట్లలో ఒకటి ఖచ్చితంగా తెరవాలి.. ఇంకా మరొకటి ఏమో ఆప్షనల్. ఇంకా ఈ అకౌంట్లనే టైర్ 1, టైర్ 2 అకౌంట్లు అని పిలుస్తారు. అయితే టైర్ 1 అకౌంట్ ఉన్న వారు టైర్ 2 అకౌంట్ ను తెరవచ్చు. 18 నుండి 65 ఏళ్ళ మధ్యలో ఉన్నవారు ఈ స్కీమ్ లో చేరచ్చు. 

 

IHG

 

ఇంకా ఈ స్కీమ్ లో చేరడం వల్ల అదిరిపోయే రాబడి పొందవచ్చు. 30 ఏళ్ళ వయసులో ఉన్న వారు రోజుకు రూ.200 లేదా నెలకు రూ. 6,000 ఇన్వెస్ట్ చెయ్యాలి. ఇలా 30 ఏళ్ళ చేస్తే మీరు మొత్తంగా 21.6 లక్షల రూపాయిలు ఇన్వెస్ట్ చేసినట్టు అర్థం. ఇంకా మెచ్యూరిటీ సమయానికి మీకు ఏకంగా 90 లక్షల రూపాయిలు వస్తాయి. 

 

అయితే ఇందులో 40 శాతం మొత్తాన్ని యాన్యుటీ ప్లాన్‌ కొనుగోలు చేయాలి. ఇంకా మిగిలిన 45 లక్షల రూపాయిలు విత్ డ్రా చేసుకోవచ్చు. ఇంకా అంతేకాదు.. మీ వయసు 60 ఏళ్లు దాటితే మీకు నెలకు 22,500 రూపాయిలు పెన్షన్ కూడా వస్తుంది. మరి ఇంకేందుకు ఆలస్యం.. మీరు ఈ స్కీమ్‌లో జూలై 31లోపు చేరితే పన్ను ప్రయోజనాలు కూడా పొందుతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: