దేశి అతి పెద్ద బ్యాంక్ ఎస్‌బిఐ ఇప్పుడు ఓ సరికొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ఆ పథకం చూస్తే ఎవరైనా సరే వావ్ అనాల్సిందే. అంత అద్భుతంగా ఉంటుంది ఆ పథకం. ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ఇంకా ఈ పథకం పేరు ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్ 2020 స్కీమ్. 

 

అయితే ఈ స్కీమ్ ఈ నెల 1వ తేదీ నుండి అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ ద్వారా ఈ బండ్లను జారీ చేస్తుంది. ఇంకా వీటిపై 7.15 శాతం వడ్డీ ఇస్తుంది. అయితే ఇది ఎఫ్ డి కంటే ఎక్కువ వడ్డీ రేటును ఇస్తుంది. ఇంకా ఈ కొత్త స్కీమ్ కు ఓ ప్రత్యేకత ఉంది. అది ఏంటి అంటే? ఆరు నెలలకు ఒకసారి వడ్డీ లభిస్తుంది. 

 

ఇంకా ఇది ఎస్‌బీఐ సహా ఇతర బ్యాంకులకు వెళ్లి కూడా వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి దిగ్గజ బ్యాంకుల్లో ఈ సేవింగ్ బాండ్స్ ఉంటాయి. ఇంకా బాండ్లను కొనుగోలు చేసిన వెంటనే ఇవి కస్టమర్ బాండ్ లెడ్జర్ అకౌంట్ కు ట్రాన్సఫర్ అవుతాయి. అయితే ఈ బండ్లను ఎలక్ట్రానిక్ రూపంలో కొనుగోలు చేయాలి. 

 

ఇంకా క్యాష్ రూపంలో కూడా ఈ బండ్లను కొనుగోలు చేయొచ్చు. అయితే క్యాష్ రూపంలో 20 వేల రూపాయిల వరకు మాత్రమే దీనికి పరిమితి. ఆన్లైన్ రూపంలో అయితే ఎటువంటి పరిమితి ఉండదు. ఇంకా దీనికి కనీసం వెయ్యి రూపాయిలు ఇన్వెస్ట్ చెయ్యాలి. ఇంకా ఇన్వెస్ట్ చేసేందుకు గరిష్ట పరిమితి ఏమి లేదు. బండ్లపై మెచ్యూరిటీ కాలం ఏడు సంవత్సరాలు. బండ్లపై వడ్డీ రేటు ప్రతి 6 నెలలకు ఒకసారి మారుతుంది. జనవరి 1, జూలై 1న వడ్డీ రేట్లు మారతూ ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: