కరోనా మహమ్మారి వల్ల ప్రజలకు చుక్కెదరైంది.. ఎక్కడ చూసినా కూడా ఆర్ధిక నష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇది చాలదన్నట్లు బ్యాంక్ లలో వడ్డీలు పెరుగుతున్నాయి. ఎలా చూసుకున్న కూడా గత ఆరు నెలలుగా ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మరోక షాక్ తగులుతుంది. ప్రైవేట్ రంగానికి చెందిన అతి పెద్ద బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్. ఈ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. అత్యంత వడ్డీ కలిగిన బ్యాంక్ గా ఈ బ్యాంక్ కు పేరుంది.



తాజాగా ఈ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించడానికి నిర్ణయించినట్లు తెలుస్తుంది.దీంతో బ్యాంక్ కస్టమర్లపై ప్రభావం పడనుంది. సాధారణంగా ఈ బ్యాంక్ కస్టమర్లకు అన్నీ సదుపాయాలను అందిస్తున్నారు. ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి మంచి బెనిఫిట్స్ ఉండేలా చూస్తున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ 7 రోజుల దగ్గరి నుంచి 10 ఏళ్ల కాల పరిమితితో ఫిక్స్‌డ్ డిపాజిట్లు అందిస్తోంది. బ్యాంక్ తాజా నిర్ణయంతో ఇకపై 7 రోజుల నుంచి 29 రోజుల కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై 2.5 శాతం వడ్డీ వస్తుంది. 30 రోజుల నుంచి 90 రోజుల ఎఫ్‌డీలపై 3 శాతం వడ్డీనీ మాత్రమే పొందవచ్చు.




ఇకపోతే 91 రోజుల నుంచి 184 రోజుల కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.5 శాతం వస్తుంది. ఇక 185 రోజుల నుంచి ఏడాదిలోపు ఎఫ్‌డీలపై 4.4 శాతం వడ్డీ పొందొచ్చు. ఏడాది నుంచి రెండేళ్ల కాల పరిమితిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంక్ 10 బేసిస్ పాయింట్లను తగ్గించినట్లు గా తెలుస్తుంది. ఏడాది నుంచి దాదాపు 18 నెలల వరకు ఎఫ్‌డీలపై 4.9 శాతం వడ్డీని పొందవచ్చు. తర్వాత రెండేళ్ల వరకు ఉన్న వాటిపై 5 శాతం వడ్డీని పొందవచ్చు. రెండేళ్ల నుంచి మూడేళ్ల లోపు ఉన్న వాటికి 5.15 శాతం వడ్డీని పొందవచ్చు. ఈ వడ్డీ రేట్లు అక్టోబర్ 21 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంక్ యాజమాన్యం ప్రకటించింది. ఈరోజు ఉదయం నుంచి ప్రజలు బ్యాంక్ ల ముందు ఉన్నారు. ఒక్కసారిగా ఇలా వడ్డీని తగ్గించుకోవడం పై నిరాశ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: