జాబ్ లు చేయడం వల్ల పెద్దగా ఒరిగేది ఏమీ లేదని చాలా వరకు సొంత వ్యాపారాలు చేయాలని అనుకుంటారు.. కొందరు ఒకవైపు జాబ్ చేస్తూ ఇలా మరో వైపు బిజినెస్ చేస్తారు. మార్కెట్ లో ఎటువంటి బిజినెస్ చేస్తే బాగా సక్సెస్ అవుతారో తెలుసుకున్న వాళ్ళు వాటిపైన. ఫోకస్ చేస్తారు. కానీ కొందరు మాత్రం ఎలాంటి వ్యాపారం చేస్తే బాగుండు అని ఆలోచనలు చేస్తారు. మరి అలాంటి వారు తక్కువ ఖర్చుతో ఈ బిజినెస్ చేస్తే బెటర్ అని నిపుణులు అంటున్నారు.. అదేం బిజినెస్.. ప్రాఫిట్ ఎంత? నష్టం ఎంత? అనేది వివరంగా తెలుసుకుందాం..



కరోనా సమయంలో ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించాలని అంటారు. అది ఏం బిజినెస్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..తక్కువ ఖర్చుతో , ఎక్కువ రాబడి వచ్చే బిజినెస్ అనేది పుట్టగొడుగుల పెంపంకం.. ఈ వ్యాపారం మొదలు పెట్టాలంటే కేవలం 5000 లేదా ఆరు వేలలో అయిపోతుంది.. అదేలానో ఇప్పుడు చూద్దాం..



ఒక చిన్న రూమ్‌లో కూడా పట్టగొడుగుల పెంపకాన్ని ప్రారంభించొచ్చు. దీని కోసం రూ.5,000 నుంచి రూ.6,000 వరకు ఉంటే సరిపోతుంది. పుట్టగొడుగుల పెంపకం కోసం మీరు కంపొసైట్‌ను ఉపయోగించాలి. దీనిని ఒకసారి చూస్తే మీరే చేసుకోవచ్చు.. సీడ్స్ వేసిన తర్వాత కేవలం 20 నుంచి 25 రోజుల్లోనే ఈ పుట్టగొడుగులు వస్తాయి. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉండటంతో చికెన్, మటన్ కన్నా కూడా ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. అందుకే ఇప్పుడు డిమాండ్ కూడా ఎక్కువే.. ప్రస్తుతం మార్కెట్ లో వీటి రేటు కిలో 100 నుంచి 150 వరకు పలుకుతుంది.మార్కెట్‌లో నేరుగా లేదంటే ఆన్‌లైన్‌లో కూడా పుట్టగొడుగులను విక్రయించొచ్చు. తక్కువ మొత్తంతోనే మంచి రాబడి పొందొచ్చు. మీరు కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తే.. ఇంట్లో కొద్దిగా స్థలంలో చేసుకొని ఎక్కువ లాభాలను పొందవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: