కేంద్ర ప్రభుత్వం ప్రజలకు మరో శుభవార్తను తెలిపింది. రుణాలను తీసుకొనే వారికి ఊరట నిస్తూ ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఆర్బీఐ బ్యాంకు కింద ఉన్న బ్యాంకుల నుంచి రుణాలను తీసుకున్న వారు వడ్డీ మీద వడ్డీ తగ్గింపుకు సంబంధించిన అంశాలపై ఆదేశాలను జారీ చేసింది.రూ.2 కోట్ల వరకు రుణాలకు మారటోరియం గడువులో వడ్డీ మీద వడ్డీ మాఫీ చేయనుంది. దీంతో ఈఎంఐ మారటోరియం బెనిఫిట్ పొందిన వారికి ఊరట కలుగనుంది.



ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో ప్రజలు అనేక ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఉద్యోగాలు పోవడం తో చాలా మంది రోడ్డున పడ్డారు.లోన్ ఈఎంఐ కట్టలేని వారికి ఊరట కలుగుతుంది.. వారితో పాటుగా నెల నెలా కరెక్టుగా ఈఎంఐ లు కట్టేవారికి కూడా కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుంది.ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నియంత్రణలోని కమర్షియల్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రోఫైనాన్స్ సంస్థల కోసం ప్రత్యేక స్కీమ్‌ను గురించి తెలియజేసింది.



అలాగే ఇప్పటి వరకు లోన్ పై వడ్డీ కట్టిన వాళ్లకు మార్చి 1 వ తేదీ నుంచి ఆగష్టు 31 వరకు కట్టిన మొత్తం వడ్డీని తిరిగి వాటితో అకౌంట్ల లో జమ చేయనున్నారు.. ఎంఎస్ఎంఈ రుణాలు, ఎడ్యుకేషన్ లోన్స్, హౌసింగ్ లోన్స్, కన్సూమర్ డ్యూరబుల్స్ లోన్స్, క్రెడిట్ కార్డు బకాయిలు, వెహికల్ లోన్స్, పర్సనల్ లోన్, కన్జప్షన్ రుణాలకు కేంద్ర ప్రభుత్వ పథకం వర్తిస్తుంది. వీటిపై వడ్డీ కట్టిన వారికి కూడా వడ్డీని నవంబర్ 5 కల్లా వారి ఖాతంలో వేసేటట్లు నిర్ణయించింది.కేంద్ర ప్రభుత్వం సాధారణ వడ్డీకి, చక్ర వడ్డీకి మధ్య వ్యత్యాసాన్ని కస్టమర్లకు అందిస్తోంది. అంటే వీరికి రూ.12 వేలకు పైగా మిగులుతుంది. ఈ డబ్బులు రుణ గ్రహీతల లోన్ అకౌంట్‌కు జమ అవుతాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: