రూపే కార్డు ఉన్నవాళ్లకు ఈ పండుగ సీజన్ మరింత సంబరంగా గడిస్తుందని అంటున్నారు. పండగలకు చాలా ఆఫర్లను కొన్ని కంపెనీలు అందుబాటులోకి తీసుకొస్తుంది. అయితే ఆన్ లైన్ లో డిజిటల్ మార్కెట్ వాళ్ళు కొత్త బ్రాండులను అందుబాటులో ఉంచడంతో పాటుగా అదిరిపోయే ఆఫర్లను కూడా అందిస్తున్నారు.. వాటి గురించి తెలుసుకున్న కస్టమర్లు ఆన్లైన్ షాపింగ్ చేస్తూ బిజీగా ఉన్నారు. మరో విషయమేంటంటే కొన్ని బ్యాంక్ కస్టమర్స్ కు కొన్ని ప్రత్యేక ఆఫర్లను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. తక్కువ ధరలో వస్తున్నాయి అంటే జనాలు మామూలుగానే ఎగబడతారు.. ఇప్పుడు భారీ తగ్గింపు అంటే ఇంకా వాళ్ళను ఆపడం కష్టం సుమీ..



రూపే కార్డు దారులకు శుభవార్త అనే చెప్పాలి.వివిధ బ్రాండ్ల ఉత్పత్తులపై మీకు 65 శాతం వరకు డిస్కౌంట్ వస్తుంది. షాపింగ్ మొదలుకొని ఫుడ్, ఎంటర్‌టైన్‌మెంట్, హెల్త్, ఫిట్‌నెస్, ఫార్మసీ , ఎడ్యుకేషన్ తదితర వాటిపై ప్రత్యేక ఆఫర్లు వర్తిస్తుంది..పండగల వేళ ‘Rupay Festive Carnival’ పేరుతో ఈ ఆఫర్‌ను ఎన్‌పీసీఐ ఈ ప్రత్యేకమైన తగ్గింపు ధరలను అందుబాటులోకి తీసుకువచ్చి. అదిరిపోయే డిస్కౌంట్ల ను చాలా సెక్యూర్ గా,కాంటాక్ట్ లెస్ , క్యాష్‌లెస్ పేమెంట్లను పెంచడానికి ఈ ప్రత్యేకమైన తగ్గింపు ధరలను ముందుకు తీసుకువచ్చి నట్లు ఎన్ పి ఆర్ సి తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది.



ఈ ఆఫర్ తో వివిధ రకాల వస్తువుల కొనుగోళ్ల పై 10 నుంచి 65 శాతం వరకు డిస్కౌంట్లు లభిస్తాయని ఎన్‌పీసీఐ ప్రకటించింది. అమెజాన్, స్విగ్గీ లాంటి ఇ-కామర్స్ సంస్థల ఉత్పత్తులతో పాటు శాంసంగ్ లాంటి ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులపై ఈ డిస్కౌంట్లు చెల్లుతాయని వెల్లడించారు.పండగ వేళ ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ప్రయోజనాలను మా కస్టమర్లు పొందుతారని ఆశిస్తున్నాం. డిజిటల్, కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్‌ను అందిపుచ్చుకుంటారని భావిస్తున్నాం.. అంటూ ఈ మార్కెటింగ్ చీఫ్ కునాల్ కలవాటియా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: