కరోనా వల్ల ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు చాలా మంది.. అయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వచ్చే వ్యాపారాలను చేయాలని అనుకుంటారు. కానీ కొంతమంది ఎలాంటి వ్యాపారాలను చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అలాంటి వారు ఈ బిజినెస్ చేస్తే మంచి లాభాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.. 


డైయిరి వస్తువులను తయారు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.. అంతేకాదు అద్భుతమైన లాభాలు కూడా ఉంటాయి. మదర్ డైయిరీ ప్రస్తుతం ఎక్కువ లాభాలను ఆర్జించే కంపెనీలలో ఒకటి.. రోజు మనం డైయిరీ వస్తువులను మనం నిత్యం వాడుతుంటాము..అందువల్ల డిమాండ్ ఉంటుంది. అయితే మీరు ఈ బిజినెస్ చేయాలని భావిస్తే మాత్రం చేతిలో రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు పెట్టుకోవాలి. మరో ముఖ్యమైన విషయమేంటంటే ఈ మదర్ డైయిరి రానున్న రోజుల్లో బేకరి ఐటమ్స్ ను కూడా తయారు చేస్తుందనే వార్తలు వినపడుతున్నాయి. మదర్ డెయిరీ పాలు, పాల ఉత్పత్తులు, ఇతర ప్రొడక్టులను తయారు చేస్తుంది. ఇంకా ఫ్రూట్స్, కూరగాయలు, ఎడిబుల్ ఆయిల్స్, ఫుడ్ ఐటమ్స్, ఊరగాయ, జ్యూస్, జామ్ వంటి ప్రొడక్టులను కూడా విక్రయిస్తుంది.



బ్రాండ్ ఫీజు కింద రూ.50,000 చెల్లించాలి. కంపెనీ వెబ్‌సైట్‌కు వెళ్లి నేరుగా ఫ్రాంచైజీ కోసం అప్లై చేసుకోవచ్చునట.. తొలి ఏడాదిలోనే ఇన్వెస్ట్‌మెంట్‌పై 30 శాతం రాబడి పొందొచ్చు. మీరు పెట్టిన మొత్తం డబ్బులు తిరిగి పొందాలంటే రెండేళ్లు పడుతుంది. ప్రతి నెలా దాదాపు రూ.44,000 వరకు రాబడి వస్తుంది. అయితే ఈ ప్రాంచైజి కోసం ముందుగా ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, కరెంటు బిల్లు వంటి డాక్యుమెంట్లను పొందుపరచాలి.. బ్యాంక్ అకౌంట్, ఫోటోలు, ఫోన్ నెంబర్, ప్రాపర్టీ డాక్యుమెంట్ వంటి వాటిని కూడా ఇవ్వాలి.. చూసారుగా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను ఎలా పొందవచ్చునో..


మరింత సమాచారం తెలుసుకోండి: