ప్రైవేట్ బ్యాంకింగ్ రంగానికి చెందిన ప్రముఖ ప్రైవేట్ దిగ్గజ బ్యాంక్ 'హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్' తమ కస్టమర్ల కోసం కొత్త ప్లాట్‌ఫామ్ తీసుకు వస్తోంది. వారి దగ్గర లోన్ తీసుకునే వారికి మెరుగైన సర్వీసులు అందించాలనే లక్ష్యంతో ఈ బ్యాంక్ పలు సరికొత్త సర్వీసులు ఆవిష్కరించేందుకు రెడీ అవుతోంది. ఈ బ్యాంక్ లో త్వరలోనే వెహికల్ లోన్ తీసుకునే కస్టమర్ల కోసం ఈ సులభతరమైన నూతన సర్వీసులు తీసుకురానుంది.

ప్రస్తుతానికి ఈ బ్యాంక్ తొలిగా ఆటోమొబైల్ రుణాలకు మాత్రమే ఈ తరహా సర్వీసులు అందుబాటులోకి తీసుకువస్తుంది. తర్వాత ఇతర రుణాలకు కూడా ఈ సదుపాయాన్ని విస్తరించనుంది. వచ్చే 2-3 నెలల కాలంలో అంటే కొత్త ఏడాదిలోపు ఈ కొత్త డిజిటల్ రిటైల్ ఫైనాన్సింగ్ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి రావొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా ఆన్‌లైన్‌లోనే వెహికల్ కొనుగోలుకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసుకోవచ్చు. విచారణ, ఆర్డర్, ఎక్స్చేంజ్, ఫైనాన్స్, హోమ్ డెలివరీ వరకు అన్ని రకాల సర్వీసులు ఈ ప్లాట్‌ఫామ్‌లోనే అందుబాటులో ఉంటాయి.

హెచ్ డి ఎఫ్ సి  బ్యాంక్ ఇప్పటికే ఈ వెబ్‌సైట్‌కు సంబంధించిన పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. పలు ఆటోమొబైల్ కంపెనీలతో కూడా చర్చలు జరుపుతోంది. ఈ ఒక్క ఆటోమొబైల్స్ మాత్రమే కాకుండా తర్వాత బ్యాంక్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ ఫైనాన్సింగ్ సర్వీసులు కూడా అతి త్వరలో ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంచనుంది. ప్రస్తుతం హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్.. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా rbi తో ప్లాట్‌ఫామ్ ఆవిష్కరణ గురించి చర్చలు జరుపుతోంది.  చర్చలు పూర్తి చేసుకొని అతి త్వరలో ఈ సేవలు ప్రారంభం కాగానే ప్రస్తుతానికి ఆటోమొబైల్ వెహికల్ లోన్స్ ప్రోసెస్ వేగవంతం అవుతాయి. ఆ తర్వాత మిగిలిన లోన్లకు కూడా వర్తింప చేసినట్లు అయితే రుణ గ్రహీతలకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: