ప్రముఖ దిగ్గజ ఈ కామర్స్ సంస్థల లో ఒకటైన సంస్థ అమెజాన్.. కొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తూ ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయిని అందుకుంటూ వస్తుంది. ప్రత్యేక ఆఫర్లను అందుకోవడం తో పాటుగా ఎక్కువ రకాల కంపెనీల వస్తువులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తుంది.  ఇప్పుడు ప్రజలకు భారీ శుభవార్త ను అందించింది. కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల్లో తక్కువ ఆదాయం కలిగిన పేద కుటుంబాల్లోని విద్యార్థులకు ఊరట నిచ్చే వార్తను అందించింది.. 



ఆన్‌లైన్ తరగతులకు కావలసిన స్స్మార్ట్ ఉప కరణాలను అందించేందుకు ‘డెలివరింగ్ స్మైల్స్’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు డెలివరింగ్ స్మైల్స్ కార్యక్రమానికి మద్దతుగా ప్రతి ఒక్కరూ తమ వంతు సాయాన్ని అందిస్తే కొంతవరకు మేలు జరుగుతుందని అమెజాన్ పేర్కొంది. కేవలం డిజిటల్ వస్తువులతో పాటుగా , మరి కొన్ని బహుమతులను కూడా అందజేయడానికి వీలు ఉంటుందని తెలిపారు.



అమెజాన్ ఈ గిఫ్ట్ లో భాగంగా 5,000 4జీ ట్యాబ్స్‌ను 18 ఎన్‌జీఓల ద్వారా విద్యార్థులకు అందించనున్నట్లు అమెజాన్ సీఈఓ తాజాగా ప్రకటించారు. అందులో భాగంగా వినియోగదారులు రూ.10,000 కన్నా తక్కువ ధర లోని మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ కంప్యూటర్లను అమెజాన్ గిఫ్ట్ ఏ స్మైల్ పేజ్ లోని ఎన్‌జిఓ జాబితాకు తగ్గట్లు లేదా డబ్బులను అమెజాన్ పే ద్వారా డొనేషన్స్  క్లిక్ బటన్ ద్వారా బదిలీ చేయవచ్చునని చెప్పుకొచ్చారు.. కోవిడ్ వల్ల యావత్ ప్రపంచం లోని ప్రజలు సర్వస్వం కోల్పోయారు.. ఈ విధమైన సాయం చేయడం వల్ల కొంతవరకు వారిని ఆదుకున్న వారమవుతామని అన్నారు.అమెజాన్ ఇండియా డెలివరింగ్ స్టైల్స్ వంటి కార్యక్రమాల ద్వారా తక్కువ ఆదాయం కలిగిన పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు బోధన ఉపకరణాలను అందించడం ద్వారా తన నిబద్ధతను కొనసాగించడం సంతోషాన్ని కలిగిస్తుంది’ అని కేంద్ర విద్యా మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ పేర్కొన్నారు. అమెజాన్ చేస్తున్న ఈ ప్రయత్నం సరైనదని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: