కరోనా ప్రభావం వల్ల ఆర్ధిక ఇబ్బందులు ఇప్పటివరకు కొనసాగుతూనే ఉన్నాయి.. దేశవ్యాప్తంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇకపోతే ఇప్పుడిప్పుడే కొద్దిగా కొలుకుంటుంది. ప్రజలను ఓ విధంగా ఆడుకోవాలని ప్రభుత్వం ప్రభుత్వం ముందుకు వస్తుంది. అలాగే వాణిజ్య బ్యాంకులు కూడా ముందుకు వస్తున్నాయి. తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా బ్యాంకులు లోన్ అందిస్తున్నాయి. ప్రస్తుతం కొత్త బిజినెస్ లు పెట్టుకోడానికి అనువుగా బ్యాంకులు ఒకరిని మించి మరొకరు తక్కువ వడ్డీకే రుణాలను ఇస్తున్నారు. దేశంలో అతి పెద్ద వాణిజ్య బ్యాంక్ ఎస్బీఐ కి సమానంగా చాలా బ్యాంకులు రుణాలను అందిస్తున్నారు. 



ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంక్‌లు వరుసపెట్టి రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు వీటితో పోటీ పడేందుకు దిగ్గజ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ బజాజ్ ఫైనాన్స్ రెడీ అయ్యింది. బజాజ్ ఫైనాన్స్‌కు చెందిన అనుబంధ సంస్థ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ తాజాగా రుణాల పై వడ్డీ రేట్లను అమాంతం తగ్గించింది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ తాజాగా హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బజాజ్ లో హౌసింగ్ లోన్స్ అతి తక్కువ ధర కే లభిస్తున్నాయి.. 6.9 శాతం నుంచే ప్రారంభమౌతున్నాయి. సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వారికి ఇది చక్కటి శుభవార్త అని చెప్పాలి.. 



ఎస్బిఐ వడ్డీ రేట్లు కూడా 6.9 నుంచే ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే..ఇతర బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు కూడా ఇదే వడ్డీ రేటుకు హోమ్ లోన్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి.బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ప్రకారం.. ఇంటి కొనుగోలు కోసం ఒక వ్యక్తి రూ.కోటి లోన్ తీసుకున్నారని అనుకుందాం. లోన్ టెన్యూర్ 30 ఏళ్లు. వడ్డీ రేటు 6.9 శాతం. రూ.65,860 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. లోన్ పూర్తయ్యేసరికి రూ.1.37 కోట్లు కట్టాలి. అదే 7 శాతం వడ్డీ రేటుకు లోన్ తీసుకుంటే రూ.1.39 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా లోన్ తీసుకోవడం వల్ల దాదాపు రెండు లక్షలకు పైగా డబ్బులను ఆదా చేసుకోవచ్చు.. ఇంక ఆలస్యం ఎందుకు మీరు కూడా బజాజ్ లో లోన్ తీసుకొని మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: