కరోనా కారణంగా మధ్యతరగతి కుటుంబంలోని ప్రజలు చాలా మంది ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు..వాటి నుంచి బయటపడాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే బ్యాంకులు ఉంటే రుణాలను తీసుకొని కొత్త వ్యాపారాలను చేసుకొని కొంతవరకు ఆర్ధిక నష్టాల నుంచి బయట పడవచ్చునని ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్ళు ఈ ఐదు స్కీమ్ లలో డబ్బులను ఇన్వెష్ట్ చేస్తే లక్షల్లో డబ్బులను సంపాదించవచ్చు అని అంటున్నారు. అదెలానో ఇప్పుడు వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..



స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో డబ్బులు పెట్టడం వల్ల రిస్క్ లేకుండా రాబడి పొందవచ్చునని మార్కెట్ నిపుణులు అంటున్నారు.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ , సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ వంటి పథకాల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. వీటిల్లో డబ్బులు పెట్టడం వల్ల అదిరిపోయే లాభాలను సొంతం చేసుకోవచ్చు..



పీపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు పెట్టడం వల్ల పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందొచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. మీరు నెలకు రూ.5,000 ఈ స్కీమ్‌లో పెడితే మెచ్యూరిటీ కాలంలో మీ చేతికి ఏకంగా రూ.16 లక్షలు వస్తాయట..ఇక సుకన్య సమృద్ధి యోజన లో డిపాజిట్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా ఇంట్లో ఇద్దరు అమ్మాయిలను స్కీమ్‌లో చేర్పించొచ్చు. వయసు పదేళ్లలోపు ఉండాలి. ఈ స్కీమ్‌పై 7.6 శాతం వడ్డీ వస్తుంది. అకౌంట్ తెరిచిన దగ్గరి నుంచి 15 ఏళ్లు డబ్బులు డిపాజిట్ చేయాలి. 21 ఏళ్ల తర్వాత అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవచ్చు. నెలకు రూ.5,000 చొప్పున ఏడాదికి రూ.60,000 డిపాజిట్ చేస్తే 26 లక్షలు వస్తుంది..



నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్‌..ఈ స్కీమ్ వల్ల ఉద్యోగంలో రిటైర్మెంట్ తర్వాత భారీ మొత్తంతోపాటు ప్రతి నెలా పెన్షన్ కూడా పొందొచ్చు. ఇంకా పన్ను మినహాయింపు ప్రయోజనాలు ఇందులో ఉంటాయి. ఇకపోతే సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్.. 60 ఏళ్లు దాటిన వారికి ఈ బెనిఫిట్. రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. మీరు రూ.5 లక్షలు పెడితే.. మెచ్యూరిటీలో మీ చేతికి రూ.6 లక్షలకు పైగా వస్తాయి..అన్నీ రకాల పన్ను మినహాయింపుల నుంచి ప్రయోజనాలు పొందవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: