భారత దేశం లో వనరులకు సంబంధించి ఎటువంటి డోకా లేదు.. అన్నీ రకాల వస్తువులకు సంబందించిన ముడి సరుకు మన దేశంలో లభిస్తుంది.దీంతో భారత దేశం తో పెట్టుబడులు పెట్టడానికి విదేశాల్లోని ప్రముఖ కంపెనీలు ముందుకు వస్తున్నాయి.కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు విదేశాల్లోని ప్రముఖ కంపెనీలు భారత దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు.. ఇప్పటికీ ముందుకొస్తున్నారు.ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో గత ఏడాదితో పోలిస్తే ఈ పెట్టుబడులు పెద్ద ఎత్తున పెరిగాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కేవలం ఆరు నెలల కాలంలో దేశంలోకి 30 బిలియన్ డాలర్లు విదేశీ నుంచి పెట్టుబడులు వచ్చాయి..



మారిషస్ , సింగపూర్ లోని కొన్ని కంపెనీలు ముందుకు వచ్చాయి.అమెరికా, నెదర్లాండ్స్, జపాన్ 7 శాతం అంతకంటే ఎక్కువగా ఉన్నాయి.భారత్‌కు పెరగడంతో మారిషస్ నాలుగో స్థానానికి చేరింది. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్‌లోకి పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చిన విషయం తెలిసిందే. విదేశీ పెట్టుబడులు పెద్ద మొత్తంలో పెరగడంతో ముఖేష్ అంబానీ పెట్టుబడులకు కారణమని అంటున్నారు.డీపీఐఐటీ గణాంకాల ప్రకారం రంగాలవారీగా చూస్తే టాప్ 10లో 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో సాఫ్టువేర్, హార్డ్‌వేర్ రంగాలు ముందుకొచ్చాయి.



వీటి పై పెట్టుబడులు పెరగడంతో మిగిలినవి తగ్గాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. దేశంలో గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల పై విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి.ఫైనాన్షియల్, బ్యాంకింగ్, బీమా, ఔట్ సోర‍్సింగ్ కలసి ఉన్నాయి. ఈ రంగాల్లో కంప్యూటర్ సాఫ్టువేర్, హార్డువేర్ విభాగానికి 12 శాతం ఎఫ్ డీఐలు వచ్చాయి. టెలికం రంగానికి 7 శాతం వచ్చింది. మహారాష్ట్ర 20 శాతం, కర్ణాటక 15 శాతం, ఢిల్లీ 12 శాతం పెట్టుబడులు వచ్చాయి. ఇకపోతే దేశంలో కరోనా కేసులు కూడా తగ్గడంతో పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.. అంతర్జాతీయ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడానికి భారత్ ను ఎంచుకోవడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: