క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు వాడని వాళ్ళు ఉండరేమో..బ్యాంకుల నుంచి డబ్బులను తీసుకొనే వారికన్నా కార్డుల ద్వారా డబ్బులను తీసుకొనేవారు ఎక్కువ అయ్యారు. ఇప్పుడు కాస్త టెక్నాలజీకి తగ్గట్లు కూడా ప్రవర్తిస్తున్నారు. డిజిటల్ లావాదేవీలను చేస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డు మరియు డెబిట్ కార్డులు వాడే వారికి వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త రూల్స్ అమలు కానున్నాయని తెలుస్తుంది. తాజాగా ఈ కార్డులను వాడే వినియోగదారులకు ఆర్బీఐ బ్యాంక్ సువర్ణావకాశాన్ని అందిస్తుంది. దుకాణ దారులు కూడా ఈ పద్దతి ద్వారా డబ్బులు తీసుకోవడం చాలా మంది చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువులను కొనుగోలు చేయడానికి కార్డులను వాడుతున్నారు. బ్యాంకులు కూడా ఇలా కార్డులను వాడే వారికి మంచి అవకాశాలను కూడా అందిస్తుంది. ఇలాంటి కస్టమర్లకు ఆర్బీఐ బ్యాంక్ కూడా కొన్ని కొత్త అవకాశాలను అందిస్తుంది..




ఈ నిర్ణయం తో ఈ కార్డులు వాడే వారికి మంచి లాభాలు ఉన్నాయని తెలుస్తుంది..కాంటాక్ట్‌లెస్ కార్డుల ట్రాన్సాక్షన్ లిమిట్‌ను పెంచుతున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ప్రస్తుతం ఉన్న రూ.2,000 నుంచి రూ.5,000 వరకు పెంచుతున్నట్లు వివరించింది.. మరో విషయమేంటంటే పిన్ ఎంటర్ చేయకుండానే 5 వేలకు పైగా లావాదేవీలను చేసుకోవచ్చు..ఈ కొత్త రూల్స్ జనవరి 1 నుంచి అందుబాటు లోకి వస్తాయి. ప్రస్తుతం చాలా బ్యాంకులు వారి కస్టమర్లకు కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. దీంతో కస్టమర్లు సులభంగానే లావాదేవీలు చేయొచ్చు..



కరోనా మహమ్మారి కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.మరోవైపు రిజర్వు బ్యాంక్ మరో కీలక అంశాన్ని కూడా వెల్లడించింది. ఆర్‌టీజీఎస్ లావాదేవీలు కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని తెలిపింది.  ఈ నిర్ణయం అందుబాటులోకి వచ్చిన పిమ్మట బ్యాంక్ కస్టమర్లు ఎప్పుడైనా ఆర్‌టీజీఎస్ ద్వారా డబ్బులు పంపించొచ్చు... మొత్తానికి కార్డు వినియోగ దారులకు ఇది చక్కటి శుభవార్త.. 

మరింత సమాచారం తెలుసుకోండి: