బైక్ కోనాలనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. అయితే ఎటువంటి బైక్ కొంటే మంచిది అనేది చాలా మందికి తెలియదు.. కొత్త బైక్ ను కొనడం కన్నా కూడా సెకండ్ హ్యాండ్ బైక్ లను కొనడం మేలని అంటున్నారు. అయితే ధర తక్కువ ఉండి,నచ్చిన బైక్ లను కొనేసదుపాయం ఉందట.. అలాా కొన్న బైక్ లకు ఇన్సూరెన్స్ కూడా ఇస్తారట. మరి ఇంక ఆలస్యం ఎందుకు ఆ బైక్ లు ఎక్కడ దొరుకుతాయో ఇప్పుడు చూద్దాం.. మరో విషయమేంటంటే.. ఇక్కడ కొన్న బైక్ లకు మంచి గిరాకీ ఉంది. అంతేకాదు అసలు సెకండ్ హ్యాండ్ అనే మాట కూడా తెలియదు.. ఎందుకంటే ఆ బైక్ లు అంత కొత్తగా ఉంటాయి.



ఇకపోతే ఈ బైకు లను కొనడానికి ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు.. ఇంట్లోనే కూర్చొనే ఆర్డర్ చేయవచ్చు.. మీకు కావలసిన బైక్ ను ఎంచుకోవచ్చు. వివరాల్లోకి వెళితే.. డ్రూ మ్ అనే ఒక యాప్ ను ఇన్స్టాల్ చేసుకొని అందులోనుంచి ఈ బైక్ లను ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ కేవలం ఒక కంపెనీకి చెందిన బైక్ మాత్రమే కాకుండా పలు కంపెనీల బైక్స్ అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా బైక్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.. ఈ యాప్ లో ప్రముఖ కంపెనీలు తమ బైక్ లను అమ్మకాలకు పెట్టింది.



ముఖ్యంగా ఏయే కంపెనీల ద్విచక్ర వాహనాలు ఉన్నాయో , వాటి ధర ఎంటో ఇప్పుడు చూద్దాం..మహీంద్రా సెంచురో 110 సీసీ బైక్ రూ.31 వేలకు అందుబాటులో ఉంది. ఇది 2013 మోడల్. బజాజ్ పల్సర్ బైక్‌ను రూ.38 వేలకు కొనుగోలు చేయవచ్చు. ఇది 150 సీసీ బైక్. 2012 మోడల్. యమహా ఎఫ్‌జెడ్ఎస్ 150 సీసీ బైక్ రూ.56 వేలకు అందుబాటులో ఉంది.యమహా బైక్ రూ.48 వేలకు అందుబాటులో ఉంది. ఇది 2012 మోడల్. 2014 మోడల్ బజాజ్ పల్సర్ 180 సీసీ బైక్ రూ.59 వేలకు లభిస్తుంది.మోండా సీబ ట్విస్టర్ 2013 మోడల్ రూ.28 వేల లోపు వస్తాయి. ఇంకా చెప్పాలంటే హీరో ప్లస్ బైక్ అయితే చాలా తక్కువగా అంటే 25 రూపాయలకే దొరుకుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: