ఇంటర్నెట్ డెస్క్: పండుగ వచ్చిదంటే చాలు ఆన్‌లైన్ ఈ కామర్స్ సంస్థలు వినియోగదారులపై ఆఫర్ల వర్షం కురిపించేందుకు సిద్ధమైపోతాయి. అన్ని రకాల వస్తువులపై భారీ ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తాయి. తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా కూడా ఆన్‌ ఈ కామర్స్ దిగ్గజ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఇదే తరహా ఆఫర్లను తీసుకొచ్చాయి. రెండు సంస్థలూ ఒకదానితో మరొకటి పోటీ పడుతూ బంపర్ ఆపర్లను ప్రకటించాయి. ఎలక్ట్రానిక్స్, హోం అప్లయెన్సెస్ తదితర పరికరాలపై భారీ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించాయి.  

రిపబ్లిక్ డే సేల్‌ను అమెజాన్‌ సంస్థ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ పేరుతో సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు అమెజాన్ తెలిపింది. ఇదులో భాగంగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను అందించనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. అందులో కూడా ప్రైమ్ సభ్యులకు ఒక రోజు ముందు నుంచే అంటే 19వ తేదీ నుంచే సేల్ మొదలవుతుందని ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్లపై గతంలో ఎన్నడూ లేనంత డిస్కౌంట్‌ను ఇవ్వనున్నట్లు పేర్కొంది. అంతేకాదు, ప్రైమ్ సభ్యులకు 20 నుంచి 22వ తేదీల్లో రాత్రి 8 గంటలకు భారీ డిస్కౌంట్‌ను ఇవ్వనున్నట్లు తెలిపింది.   

ఇక అమెజాన్‌కు పోటీగా ఏమాత్రం తగ్గకుండా మరో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా భారీ ఆఫర్లను ప్రకటించింది. ‘బిగ్ సేవింగ్ డేస్’ పేరుతో ఈ ఆఫర్లకు శ్రీకారం చుట్టింది. 20 నుంచి 24 వరకూ ఈ సేల్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది. టీవీలపై 75 శాతం వరకూ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది.   

అమెజాన్ ఎస్‌బీఐ కార్డుపై డిస్కౌంట్‌లు ప్రకటిస్తే.. ఫ్లిప్‌కార్ట్ హెచ్‌డీఎఫ్‌సీ కార్డులపై 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఇక ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోండి. రిపబ్లిక్‌డేకు హ్యాపీనెస్ తెచ్చుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: