ప‌ల్స‌ర్ అంటేనే కుర్రాళ్ల ప‌ల్స్ రేటు ఒక్క‌సారిగా పెరుగుతుంది. అలాంటిది 180 మోడ‌ల్ అన‌గానే శ‌ర‌వేగంగా ప‌ల్స్ రేటు పెరిగిపోతోంది. ప్రముఖ వాహన సంస్థ బజాజ్.. తన పల్సర్ 180 మోడల్ ను భారత మార్కెట్లోకి విడుద‌ల చేసింది. ఎక్స్ షోరూంలో ఈ మోటార్ సైకిల్ ప్రారంభ ధర  రూ.1.08 లక్షలుగా ఉంది.  పికప్,  ఇంజిన్ ప్రదర్శనతో పాటు  రైడింగ్ అనుభూతినిచ్చే పల్సర్ మోటార్ సైకిళ్లంటే ఎంతో క్రేజ్.  2021 మోడల్ పల్సర్ 180 మోటార్ సైకిల్ ను బ‌జాజ్ భారత మార్కెట్లో కి విడుద‌ల చేసింది. పాత సెమీఫెయిర్డ్ 180 ఎఫ్‌ మోడల్ స్థానంలో ఈ సరికొత్త బైక్ రీప్లేస్ చేసినట్లు కంపెనీ తన వెబ్ సైట్లో పేర్కొంది. ఎక్స్ షోరూంలో ఈ మోటార్ సైకిల్ ప్రారంభ ధర రూ.1.08 లక్షలు. మైలైజీ  లీటరుకు  45 కిలోమీటర్లు వ‌స్తుంద‌ని కంపెనీ ప్ర‌క‌టించింది.

ఈ సరికొత్త పల్సర్ 180 మోడల్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్,  ఇవి 90/90 ఫ్రంట్, 120/80 రియర్ ప్రొపైల్ టైర్లు. వీటితో పాటు సెమీ డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్, స్టాండర్డ్ ఎల్ఈడీ టెయిల్ లైట్లు లాంటి ప్రత్యేకతలతో అందుబాటులోకి తెచ్చారు. 178.6సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ దీని సొంతం. ఇది 8500 ఆర్పీఎం వద్ద 16 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 6500 ఆర్పీఎం వద్ద 14.5 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. సస్పెన్షన్, బ్రేకింగ్ సెటప్ ను కూడా మార్చి ఫ్రంట్ సైడ్ స్టాండర్డ్ టెలిస్కోపిక్ ఫోర్కులు, ఫైవ్ వే అడ్జస్టబుల్ నైట్రస్ షాక్ అబ్జార్బర్లను వెనుక భాగంలో పొందుపరిచింది. ఈ సరికొత్త మోటార్ సైకిల్లో రెండు వైపులా డిస్క్ బ్రేకులను అమర్చారు. 280ఎంఎం ఫ్రంట్, 230 ఎంఎం రియర్ యూనిట్లున్నాయి. సింగిల్ ఛానెల్ ఏబీఎస్ స్టాండర్డ్ ను మద్దతుగా ఇచ్చారు.

ఈ మోటార్ సైకిల్ ఇంధన ట్యాంకు సామర్థ్యం 15 లీటర్లు.  లీటరుకు గరిష్ఠంగా 45 కిలోమీటర్ల మైలేజీనిస్తునందని కంపెనీ స్పష్టం చేసింది. మోటార్ సైకిల్ బరువు వచ్చే 145 కేజీలు. పాత 180 ఎఫ్ మోడల్ కంటే 6 కేజీల బరువు తక్కువ. కలర్ టోన్ వచ్చేసి బ్లాక్-రెడ్ కాంబినేషన్ లో లభ్యమవుతుంది. ఈ 2021 బజాజ్ పల్సర్ 180 మోడల్ కు పోటీగా భారత మార్కెట్లో టీవీఎస్ ఆర్టీఆర్ 180, హోండా హార్నెట్ 2.0 లాంటి బైక్స్ ఇప్ప‌టికే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: