మోటరోలా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మొట్టమొదటి 108ఎంపీ కెమెరా వంటి అద్భుతమైన ఫీచర్లతో మోటో ఎడ్జ్ ప్ల‌స్ స్మార్ట్‌ఫోన్ ను గత ఏడాది మేలో భారతదేశంలో విడుదల చేసింది. అయితే ఇప్పుడు కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్ ధరను సుమారు రూ.10,000 వరకు తగ్గించనున్నట్లు ప్రకటించింది. 2020 లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865, 108-మెగాపిక్సెల్ కెమెరా, ఓలెడ్‌ డిస్ప్లే ,5జి వంటి టాప్-ఆఫ్-ది-లైన్ ఫీచర్లతో విడుద‌లైంది.

మోటరోలా కంపెనీ మోటో ఎడ్జ్ ప్ల‌స్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో 12జీబీ ర్యామ్ మరియు 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఒకే ఒక‌ వేరియంట్ తో రూ.74,999 ధర వద్ద విడుదల చేసింది. అయితే ఇప్పుడు రూ.10వేల వ‌ర‌కు ధ‌ర త‌గ్గించ‌డంతో వినియోగదారులు ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.64,999 ధర వద్ద కొనుగోలుచేసే అవ‌కాశం ల‌భిస్తోంది.

6.67-అంగుళాల ఫుల్-హెచ్‌డితో డిస్ప్లే ఉంది.  సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు వైపు f / 2.0 ఎపర్చరు,  0.9-మైక్రాన్ పిక్సెల్ పరిమాణంతో 25 మెగాపిక్సెల్ కెమెరాఉంది. క‌ర్వుడ్  ఓలెడ్‌ డిస్ప్లే 90హెడ్జ్  రిఫ్రెష్ రేట్, హెచ్‌డీఆర్‌10 + సపోర్ట్ మరియు పంచ్-హోల్ సెల్ఫీ కెమెరా డిజైన్‌తో వస్తుంది. అంతర్గతంగా ఇది ఎడ్జ్ సిబ్లింగ్ నుంచి భిన్నంగా ఉంటుంది. మోటో ఎడ్జ్ ప్ల‌స్‌ 108-MP కెమెరా సెటప్ మోటరోలా ఎడ్జ్ ప్ల‌స్‌ స్మార్ట్‌ఫోన్ కెమెరాల విషయానికొస్తే వెనుకవైపు ట్రిపుల్-కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో హై-ఎండ్ ఎడ్జ్ + లో హై-రెస్ 108-మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్ ఎఫ్ / 1.8 ఎపర్చరు,  0.8-మైక్రాన్ పిక్సెల్ సైజుతో ఉంటుంది. ట్రిపుల్-కెమెరా సెటప్‌లోని ఇతర రెండు లెన్స్‌లలో 16 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అన్స్ 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెటప్‌కు స్టాండర్డ్ వేరియంట్ ఎడ్జ్ వంటి టోఫ్ సెన్సార్ మద్దతు ఇస్తుంది. ఇది 2ఎక్స్‌కి, బదులుగా 3ఎక్స్‌‌ ఆప్టికల్ జూమ్‌ను కలిగి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: