ప్రముఖ దేశీయ బ్యాంక్ ఎస్బిఐ ఖాతాదారులకు అదిరిపోయే న్యూస్ చెప్పింది..ఇటీవల కరోనా సంక్షోభం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆ సందర్భంలో ప్రజలు ఆర్ధిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్నారు.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలను ఆదుకుంది. సొంతంగా బిజినెస్ చేసుకోవాలని అనుకునేవారికి కొత్త రుణాలను అందించింది.వీటి వల్ల ప్రజలు సంతోషంగా ఉంటారు. ఇప్పటికే ఎన్నో రకాల లోన్స్ ను ఇచ్చింది. అంతేకాదు వాటికి తక్కువ వడ్డీని కూడా అందించింది...


ఇప్పుడు మరోసారి బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పనుంది.. రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో బ్యాంక్ నుంచి లోన్ తీసుకునే వారికి ఊరట కలుగనుంది. అయితే ఇది అందరికీ వర్తించదు. కేవలం హోమ్ లోన్ తీసుకొనేవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. హోమ్ లోన్ తీసుకునే కస్టమర్లకు మాత్రమే రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు ఉంటుందని స్టేట్ బ్యాంక్ తెలిపింది. మార్చి 31 వరకు బ్యాంక్ నుంచి హోమ్ లోన్ తీసుకునే వారు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన పని లేదని చెప్తుంది... ఇది నిజంగానే గుడ్ న్యూస్ అనే చెప్పాలి..


ఎస్‌బీఐ భిన్న రకాల వినియోగదారులకు అనేక హోం లోన్ స్కీమ్‌లను అందిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎస్‌బీఐ ప్రివిలెజ్ హోం లోమ్‌, డిఫెన్స్ ఉద్యోగులకు ఎస్‌బీఐ శౌర్య హోం లోన్‌, ఇతరులకు ఎస్‌బీఐ మ్యాక్స్ గెయిన్ హోం లోన్‌, ఎస్‌బీఐ స్మార్ట్ హోమ్‌, టాపప్ లోన్, ఎస్‌బీఐ ఎన్ఆర్ఐ హోం లోన్‌, ఫ్లెక్సి పే హోం లోన్‌, ఎస్‌బీఐ హర్ ఘర్ హోం లోన్ ఇలా చాలా లోన్స్ ను వినియోగ దారులకు అందిస్తుంది.ఎస్‌బీఐలో వినియోగదారులు హోం లోన్ తీసుకోవాలంటే 7208933140 అనే నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు. బ్యాంకు ప్రతినిధులు వినియోగదారులను సంప్రదించి లోన్లను వివరించి ఆఫర్ల గురించి తెలియజేస్తారు. ఇప్పటికే గృహ రుణ మార్కెట్‌లో ఎస్‌బీఐ వాటా 34 శాతం ఉండగా, రోజుకు వెయ్యి మందికి పైగా రుణాలను అందిస్తున్నట్లు బ్యాంక్ అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: