మహిళలు సొంతంగా వ్యాపారం చేసుకోవాలని అనుకుంటారు.. కాలం మారింది. మగవాళ్ళ పై ఆధారపడకుండా సొంత వ్యాపారాలు చేస్తుంటారు. అలాంటి వారికి బ్యాంకులు కూడా రుణాలను అందిస్తున్నారు. మహిళల అభివృద్ధికి సాయపడుతున్నారు. మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ మహిళా ఉద్యమి నిధి యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద మహిళలకు తక్కువ వడ్డీకి ఆర్థిక సహాయం అందించడం, అలాగే వారికి అధికారం ఇవ్వడం జరుగుతుంది. మహిళలను పారిశ్రామిక రంగంలో మరో మెట్టు పెంచేలా పథకాన్ని అభివృద్ది చేస్తుంది.


మహిలా ఉద్యోగ్ నిధి యోజన అందించిన నిధులను మీడియం మరియు చిన్న వ్యాపారం సేవ, తయారీ, ఉత్పత్తి కి సంబంధించిన కార్యకలాపాలకు ఉపయోగించవచ్చు. ఈ పథకం కింద పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణాలు ఇవ్వడం ప్రారంభించింది. మహిళా పారిశ్రామికవేత్తలు తమ సొంత వ్యాపారం లేదా చిన్న వ్యాపారం ప్రారంభించాలని భావిస్తే ఈ బ్యాంక్ ద్వారా పది లక్షల వరకు రుణాలను పొందవచ్చు.


పిఎన్‌బి మహిళా ఉద్యమ్ నిధి పథకం కింద రుణాలు అందిస్తుంది. ఈ పథకం ద్వారా మీరు మీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మహిళలు తమ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడాని కి బ్యాంక్ సహాయపడుతుంది. ఇందులో కొత్త టెక్నాలజీ, వ్యాపారాన్ని పెంచుకోవడం మరియు కొత్త నైపుణ్యాలను సంపాదించడంలో దోహద పడుతుంది.


ఒక బేబీ కేర్ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, బ్యాంక్ ఆమెకు సహాయం చేస్తుంది. ఈ రుణం కింద, మహిళ తన వ్యాపారాన్ని హాయిగా ప్రారంభించగలిగేలా ప్రాథమిక వస్తువులు, పాత్రలు, స్టేషనరీ, ఫ్రిజ్, కూలర్లు, ఆర్‌ఓ వంటివి వృద్ధి చేయడానికి బ్యాంక్ మహిళలకు సహాయపడుతుంది.


వీటితో పాటుగా మహిళా సాధికారత ప్రచారం , మహిళ సమిధి ప్రయోజనం వంటి పథకాల ద్వారా కూడా రుణాలను పొందవచ్చు.ఈ రుణాల ద్వారా కొంతవరకు వారు లాభాలను పొందవచ్చు.. తోటి వారికి ఆదర్శంగా మారవచ్చు.. అన్నికన్నా ముందు సొంత కాళ్లపై దర్జాగా బ్రతకోచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: