సాధార‌ణ ఫోన్ల నుంచి స్మార్ట్‌ఫోన్లకు మారాలనుకునేవారికి, కొత్త మోడళ్లు కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త‌. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ స్మార్ట్‌ఫోన్ కార్నివాల్‌ను ప్రారంభించింది. ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ ఎక్స్ఆర్, రియల్‌మి సి12, పోకో సి3, రియల్‌మి నర్జో 30ఎ తదితర ఫోన్లపై రాయితీ ప్ర‌క‌టించింది. యాక్సిస్ బ్యాంకుతో క‌లిసిన‌ ఫ్లిప్‌కార్ట్ డెబిట్, క్రెడిట్ కార్డులపై రూ.1,250 వరకు తక్షణ రాయితీ ఇస్తోంది. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్, ఎక్స్ఛేంజ్ ఆఫ‌ర్‌ ప్రకటించింది.

12వ తేదీ వ‌ర‌కు
ఈ  కార్నివాల్ ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగుతుంది. ఐఫోన్ ఎస్ఈ (2020) 64 జీబీ మోడల్, 128 జీబీ ఆప్షన్ ధరను రూ.34,999 నుంచి రూ. 29,999కి తగ్గించింది. ఐఫోన్ ఎక్స్ఆర్ 64జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధరను రూ. 45,984 నుంచి రూ.38,999కి తగ్గించింది. 128 జీబీ మోడల్ ధరను రూ.43,999కి ఇస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ పై రూ. 5 వేల‌ రాయితీ, పాత ఫోన్ల ఎక్స్‌చేంజ్‌పై ఫ్లిప్‌కార్ట్ అదనంగా రూ.7 వేల రాయితీ ఇస్తోంది. రెడ్‌మి 9 ప్రొ మ్యాక్స్‌పై రూ.2 వేలు తగ్గించ‌డంతో రూ.14,999 నుంచి అందుబాటులో ఉంది. మోటో జి 5జిని రూ. 21,200కు, ఫ్లిప్‌కార్ట్ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్‌పై అదనంగా రూ. 2 వేల రాయితీ  ఇస్తోంది. ఐక్యూ 3ని రూ. 24,990కి విక్రయానికి పెట్టింది. నెలకు రూ. 4,998తో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఆఫర్ చేస్తోంది.

స్మార్ట్‌ఫోన్ కార్నివాల్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎఫ్41పై  రూ. 1500 రాయితీని కంపెనీ  ప్రకటించింది. ఈ ఫోన్ 64 జీబీ మోడల్ ధర రూ. 15,999గా పేర్కొనగా, రూ. 128 జీబీ మోడల్‌ను రూ. 16,4999కి ఇస్తున్నారు. బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రియల్‌మి సి12 3జీబీ ర్యామ్+32 జీబీ వేరియంట్‌పై రూ. 500 రాయితీ ప్రకటించారు. రూ.8,4999కి అందుబాటులో ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: