ఒక జర్నలిస్టు ట్వీట్ ఖరీదు 54 వేల కోట్ల రూపాయలు అంటే నమ్మగలమా ? కానీ నమ్మక తప్పదు. ఆదాని గ్రూప్ సంపద 54 వేల కోట్ల ఆవిరి కావటానికి ఒక ప్రముఖ జర్నలిస్టు మరియు మనీ లైఫ్ మేనేజింగ్ ఎడిటర్ సుచేతా దలాల్ ట్వీట్ కారణం అయ్యింది మరి.  దేశంలో ఒక కంపెనీ  ట్రేడింగ్ లో ఏదో భారీ మోసం జరుగుతుందని ఆ కంపెనీకి చెందిన షేర్ వ్యాల్యును  రిగ్గింగ్ చేస్తూ వస్తుందని ఆమె ఒక ట్వీట్ చేసింది. సెబీ ట్రాకింగ్ సిస్టమ్ ఆ కంపెనీ చేసిన కుంభకోణాన్ని వెలికితీసి నిరూపించటం కష్ణం అంటూ ఆమె పరోక్షంగా ఆదానీ గ్రూప్ ను ఉద్దేశిస్తూ  ట్వీట్ చేసారు. దీంతో కొన్ని గంటల్లోనే  ఆదాని గ్రూప్ షేర్ భారీగా పతనం అయి 54 వేల కోట్లు సంపద ఆవిరి  అవటానికి కారణం అయ్యింది. 


1992లో  అప్పటి కేంద్ర ప్రభు త్యాన్ని కుదిపేసిన  హర్షత్ మెహతా కుంభకోణాన్ని కూడా  సుచేతా దలాల్‌ బయట పెట్టింది. ఐతే ఆదానీ గ్రూప్ చేస్తున్న షేర్ ప్రైస్ రిగ్గింగ్ చేస్తున్నదని తెలిసి కూడా సెబీ ఏ చర్య తీసుకోకపోగా అది కనుక్కోలేక పోతున్నాం అని చెప్పటం కాస్త అనుమానాస్పదమే అని చెప్పాలి. ఈ క్రమంలోనే సెబీ ఎవరికోసం పని చేస్తోందో , ఎవరి కనుసన్నల్లో పని చేస్తోందో ఊహించవచ్చని అంటూ పెద్ద ఎత్తిన విమర్శలు వినిపిస్తున్నాయి. సుచేతా దలాల్‌ జూన్‌ 12న చేసిన ట్విట్‌ ప్రస్తుతం ట్విటర్‌లో ట్రెండింగ్‌గా  మారింది.

 సుచేతా దలాల్‌ తన ట్విట్‌లో ‘ఓ కంపెనీకు చెందిన షేర్‌ వాల్యూను రిగ్గింగ్‌ చేస్తూ వస్తోంది. సెబి ట్రాకింగ్‌ సిస్టమ్‌లతో లభ్యమయ్యే సమాచారంతో.. ఆ కంపెనీ చేసిన కుంభకోణాన్ని వెలికితీసి నిరూపించడం కష్ట''మని అం పేర్కొంది.  అయితే మరో పక్క ఎన్‌ఎస్‌డీఎల్‌ అదానీ గ్రూప్‌కు చెందిన విదేశీ నిధుల ఖాతాలను స్తంభింపజేసిందన్న వార్తలను అదానీ ఖండించింది కూడా. ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించడానికే ఉద్ధేశపూర్వకంగా కుట్ర జరిగిందని ఆరోపించింది. అలాగే అదానీ గ్రూప్ స్టాక్స్ హోల్డ్ చేస్తున్న ఎఫ్పీఐల ఖాతాలను స్థంభింపజేశారన్న వార్తలను కూడా ఎన్‌ఎస్‌డీఎల్‌ తోసిపుచ్చింది. ఆ అకౌంట్లన్నీ యాక్టివ్‌గానే ఉన్నాయంటూ ఓ సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చింది. మొత్తం మీద ఒక ట్వీట్ ఖరీదు 54 వేల కోట్ల రూపాయలు అనేది నిరూపితం అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: