పీఎఫ్ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను కేంద్రం అందించింది. కరోనా కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి అవకాశాలు ఇవ్వడం నిజంగానే గుడ్ న్యూస్ అనే చెప్పాలి.కరోనా సంక్షోభం లో ఉన్న వారికి ఇది శుభవార్త అనే చెప్పాలి వాళ్ళు చేస్తున్నప్రైవేట్ , ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోయిన కూడా కోవిడ్ అడ్వాన్స్ సర్వీసును వినియోగించుకోవచ్చునని స్పష్టం చేసింది. ఈపీఎఫ్‌ఓ ప్రకారం, ఎవరైనా ఉద్యోగం వదిలేసినా లేదా పోగొట్టుకున్న, లేదా.. మరే కంపెనీలో చేరకపోతే, పీఎఫ్ ఫండ్‌లో నుంచి కొంత డబ్బులను అడ్వాన్స్ గా పొందవచ్చు. అది కూడా అడ్వాన్స్ గా తీసుకోవచ్చు అని ప్రభుత్వం తేల్చి చెప్పింది.


ఆ డబ్బును ఉద్యోగి మళ్లీ తిరిగి పీఎఫ్ ఖాతాలో జమ చేయాల్సిన అవసరం లేదు. ఈ అడ్వాన్స్ లను పొందడానికి ఈపీఎఫ్ కొన్ని నియమాలను అందించింది. అయితే,  వీటికి అర్హుల బేసిక్ సాలరీ, మూడు నెలలు లేదా ఈపీఎఫ్ ఖాతా లో ఉన్న 75 శాతం వరకు డబ్బును  తీసుకోవచ్చు. మాములుగా ఈ పీఎఫ్ లో కొంతభాగం ఉద్యోగులది ఉంటే, మరి కొంత భాగం పని చేస్తున్న కంపెనీ నుంచి ఉంటుంది. పీఎఫ్ దరఖాస్తు కోసం.. ఉద్యోగి తన ఫోన్ నుండి ఈపీఎఫ్ ఇండియా వెబ్‌ సైట్ లేదా యూనిఫైడ్ పోర్టల్‌ లో లాగిన్ కావాలి.


అత్యవసర పనుల కోసం కొంత అడ్వాన్స్ తీసుకున్న కూడా మరల రెండోసారి కూడా అడ్వాన్స్ ను పొందవచ్చు. అయితే ముందుగా కేవైసీని పూర్తి చేసుకోవాలి. అప్పుడే కోవిడ్ అడ్వాన్స్ ప్రక్రియ పూర్తవుతుందని ఈపీఎఫ్ఓ వెల్లడించింది. యుఏఎన్ నెంబర్‌తో ఆధార్, కేవైసీ, బ్యాంక్ ఖాతాతో లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ లింక్ అయితేనే కోవిడ్ అడ్వాన్స్ ప్రక్రియ పూర్తవుతుందని గుర్తుంచుకోవాలి. ఈ అడ్వాన్స్ కోసం కేవైసీ పూర్తయిన మూడు రోజుల్లోనే క్లెయిమ్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి చాలా అవసరం.



మరింత సమాచారం తెలుసుకోండి: